అత్యధిక పారితోషికం ఆమెదే


హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటి ఆమె. నార్మాషేరర్, గ్రెటా గార్బోలాంటి అందాల తారలు తెరనేలుతున్నప్పటికీ, వారందరినీ మించి ప్రాచుర్యాన్ని సాధించిన అందాల తార ఆమె. పేరు జొయాన్‌ క్రాఫోర్డ్‌. మేటి చిత్ర నిర్మాణ సంస్థ ఎమ్‌జీఎమ్‌ తీసిన ఎన్నో సినిమాల్లో మెప్పించే పాత్రలు చేసింది. కష్టపడి పని చేస్తూ ప్రేమను, విజయాన్ని పొందిన పాత్రలను ఎక్కువగా పోషించిన ఆమె, ఆనాటి ప్రేక్షకులకు అభిమాన తారగా మారింది. టెక్సాస్‌లో 1904 మార్చి 23న పుట్టిన క్రాఫోర్డ్, ‘మైల్డ్‌రెడ్‌ పియర్స్‌’ సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ‘పొజెస్స్‌డ్‌’ (1947), ‘సడన్‌ ఫియర్‌’ (1952), ‘వాటెవర్‌ హ్యాపెన్డ్‌ టు బేబీ జేన్‌?’ (1962) లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆపై పెప్సీకోలా ఛైర్మన్‌ ఆల్ఫ్రెడ్‌ స్టీలేను పెళ్లాడి చిత్రాల నుంచి దూరమైంది. న్యూయార్క్‌లో 1977 మే 10న తన 73వ ఏట మరణించింది.

 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.