క్లాసిక్‌ కథానాయిక
హాలీవుడ్‌లో చిరకాలం గుర్తుంచుకోదగిన క్లాసిక్‌ సినిమాలు వచ్చిన కాంలో అయిదు దశాబ్దాల పాటు నటిగా అలరించిందామె. ప్రపంచవ్యాప్తంగా గొప్పవిగా ప్రాచుర్యం పొందిన కొన్ని సినిమాల్లో మరిచిపోలేని పాత్రలతో ఆకట్టుకుంది. ఆమే... జోన్‌ ఫాంటైన్‌. సస్పెన్స్‌ సినిమాలకు పేరొందిన ఆల్ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ఈమె సోదరి ఒలివియా హవిలాండ్‌ కూడా నటిగా రాణించింది. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి ఎక్కువ ఆస్కార్లు అందుకున్న సహోదరులుగా గుర్తింపు పొందారు.


కాలిఫోర్నియాలో 1917 అక్టోబర్‌ 22న పుట్టిన జోన్‌ డె బ్యూవాయిర్‌ డె హవిలాండ్, వెండితెరపై జోన్‌ ఫాంటైన్‌గా పేరొందింది. ‘ద మ్యాన్‌ హూ ఫౌండ్‌ హిమ్‌సెల్ఫ్‌’ (1937), ‘గుంగాదిన్‌’ చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన ‘రెబెక్కా’ సినిమాతో స్టార్‌డమ్‌ అందుకుంది. హిచ్‌కాక్‌ మరో సినిమా ‘సస్పిషన్‌’ సినిమాకు ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది. ‘ద కాన్‌స్టంట్‌ నింఫ్‌’, ‘లెటర్‌ ఫ్రమ్‌ ద అన్‌నోన్‌ ఉమన్‌’, ‘వోయేజ్‌ టుది బాటమ్‌ ఆఫ్‌ ద సీ’, ‘ద విచెస్‌’, ‘కాలిట్‌ ఎ డే’, ‘నోమోర్‌ లేడీస్‌’, ‘ఎ మిలియన్‌ టు వన్‌’ లాంటి సినిమాలతో మంచి నటిగా నిరూపించుకుంది. నాటక రంగం, రేడియో, టెలివిజన్‌ రంగాల్లో కూడా ఆమె తనదైన ముద్ర వేసింది. తన ఆత్మకథను ‘నో బెడ్‌ ఆఫ్‌ రోజెస్‌’ పేరుతో వెలువరించింది. ఇంగ్లిషు దంపతులకు జపాన్‌లో పుట్టిన ఈమె తల్లి ప్రోద్బలంతో నటనవైపు దృష్టి సారించింది. తల్లి కూడా నటి కావడంతో చిన్న వయసులోనే నాటకాలతో పేరు తెచ్చుకుంది. అందాల తారగా, హుందా అయిన అభినేత్రిగా అంచెలంచెలుగా ఎదిగింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.