హాలీవుడ్‌ నిర్మాత జోనాస్‌ మెకాస్‌ కన్నుమూత

ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న చలనచిత్ర నిర్మాత, రచయిత, నటుడు జోనాస్‌ మెకాస్‌ (96). ఈ ప్రపంచానికి దూరంగా పరలోకానికి చేరిపోయారు. జనవరి 23, 2019న న్యూయార్క్‌లో కన్నుమూశారు. ’ది గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ అమెరికన్‌ అవంత్‌ గ్రేడ్‌ సినిమా’ అని ముద్దుగా పిలుచుకునే జోనాస్‌ డిసెంబర్‌ 24, 1922 నాజీ ఆక్రమిత ప్రాంతం లిథువేనియాలో జన్మించారు. సినిమా చరిత్రలోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించారు. సంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టి, తను అనుకున్న కథలను, తక్కువ బడ్జెట్‌లోనే తీసేవారంట. సినిమాల్లోకి రాకముందు బతకడం కోసం చిన్న చిన్న పనులు చేసేవాడు న్యూయార్కు నగరంలో. అలా చేయగా వచ్చిన డబ్బులతో ఓ చిన్న కెమెరా కొనుగోలు చేసి, దాని ద్వారా తన జీవితాన్ని ప్రారంభించాడు. అలా తన తోటి నటులైన అలెన్‌ గిన్స్‌బెర్గ్, జోనా లెనాన్, యేకో ఓనోలాంటి వారితో చిన్న చిన్న ప్రయోగాత్మాక చిత్రాలు తీశాడు. మెకాస్‌ ఒక రచయిత, కవి, విమర్శకుడు కూడా. మెకాస్‌ అన్న అడాల్ఫ్‌ మెకాస్‌ ‘ఫిల్మ్‌ కల్చర్‌’ అనే జర్నల్‌ కూడా నడిపారు. అందులో మెకాస్‌ ‘విలేజ్‌ వాయిస్‌’ అనే కాలమ్‌ పేరుతో వ్యాసాలు కూడా రాశారు. అమెరికన్‌ సినిమాకు మెకాస్‌ ఎన్నో సేవలు చేశారు. మెకాస్‌ చాలా చిత్రాలు తీశారు. వాటిలో చెప్పుకోదగినవి ‘గన్స్‌ ఆఫ్‌ ది ట్రీస్‌ (1963), లాస్ట్‌ లాస్ట్‌ లాస్ట్‌ (1976), ‘ది బ్రిగ్‌’ (964), ‘వాల్డెన్‌’ (1969)ఇలా చాలానే ఉన్నాయి. జోనాస్‌ మెకాస్‌కు ‘టైటాన్‌ ఆఫ్‌ అండర్‌గ్రౌండ్‌ ఫిల్మ్‌మేకర్‌’ అని కూడా అంటారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.