ఆమె ప్రతిభకు అవార్డులే గీటురాళ్లు

ఆస్కార్‌... గోల్డెన్‌గ్లోబ్‌... బాఫ్టా... స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌... ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులన్నీ ఆమెను వరించి వచ్చాయి. ఆమె నటించిన ఆరు సినిమాలు ‘100 మేటి బ్రిటిష్‌ సినిమాలు’ జాబితాలో స్థానం సంపాదించాయి. ఆమే జూలీ క్రిస్టీ. ‘బిల్లీ లయర్‌’ (1963) సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రిస్టీ, ‘డార్లింగ్‌’ (1965) సినిమాకి ఆస్కార్‌ అవార్డు సాధించింది. ‘డాక్టర్‌ జివాగో’, ‘ఫారెన్‌హీట్‌ 451‘, ‘ద మేడింగ్‌ క్రౌడ్‌’, ‘పెటుల్లా’, ‘ద గో బిట్వీన్‌’, ‘మెకాబే అండ్‌ మిసెస్‌ మిల్లర్‌’, ‘డోన్ట్‌ లుక్‌ నౌ’, ‘షాంపూ’, ‘హెహెన్‌ కెన్‌ వెయిట్‌’లాంటి సినిమాల ద్వారా మంచి నటిగా నిరూపించుకుంది. ప్రపంచ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ‘ట్రాయ్‌’, ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద ప్రిజనర్‌ ఆఫ్‌ అజ్‌బెకన్‌’ సినిమాలతో మరింత ప్రాచుర్యం పొందిన ఈమె పుట్టింది భారతదేశంలో కావడం విశేషం. బ్రిటిష్‌ పాలన కొనసాగుతున్న రోజుల్లో అస్సాంలో 1940 ఏప్రిల్‌ 14న పుట్టిన క్రిస్టీ, తండ్రి నిర్వహించే తేయాకు తోటల్లో పెరిగింది. అమ్మానాన్నా విడిపోయాక తల్లి దగ్గర వేల్స్‌లో పెరిగిన ఈమె నాటకాల ద్వారా నటనా ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.