అవార్డుల నటుడు
నాలుగు ఆస్కార్‌ అవార్డులు...

రెండు బ్రిటిష్‌ అకాడమీ అవార్డులు...

అయిదు ఎమ్మీ అవార్డులు...

మూడు గోల్డెన్‌ గోల్డ్‌ అవార్డులు...

బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’, నైట్‌హుడ్, లైఫ్‌ పీరేజ్‌ పురస్కారాలు...

ఇవి కాక బ్రిటన్‌లో అతిపెద్ద ఆడిటోరియానికి అతడి పేరు... అతడి పేరిట ఎలా అఆర్డుల ప్రదానం...


ఇవన్నీ ఓ నటుడి ప్రస్థానంలో మైలురాళ్లు. విలక్షణ నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నటుడే లారెన్స్‌ ఆలివర్‌. నాటక రంగం, సినిమా, బుల్లితెర రంగాల్లో అతడు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌ పట్టణంలో 1907 మే 22న పుట్టిన ఇతడు తండ్రి ప్రోత్సాహంతో నటనారంగంలోకి వచ్చాడు. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పదేళ్ల వయసులో నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆపై వెండితెరపై వెలిగాడు. ‘ఒథెల్లో’, ‘ద మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌’, ‘ఊదరింగ్‌ హైట్స్‌’, ‘రెబెక్కా’, ‘హామ్లెట్‌’, ‘ద షూస్‌ ఆఫ్‌ ద ఫిషర్‌మేన్‌’, ‘మారథాన్‌ మేన్‌’, ‘ద బాయిస్‌ ఫ్రమ్‌ బ్రెజిల్‌’లాంటి ఎన్నో సినిమాల ద్వారా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ విలక్షణ నటుడు 1989 జులై 11న మరణించాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.