విలక్షణ నటుడు

క్రిస్టోఫర్‌ ఫ్రాంక్‌ కరన్‌డిని లీ... ‘సర్‌’ క్రిస్టోఫర్‌లీగా మారడం వెనుక, 70 ఏళ్ల పాటు నటుడిగా, గాయకుడిగా, రచయితగా సాగిన ఆయన సుదీర్ఘ ప్రస్థానం ఉంది. ఆ ప్రయాణంలో అడుగడుగునా నేర్చుకునే తత్వం, తనను తాను మార్చుకునే తత్వం స్ఫుటంగానే కనిపిస్తాయి. ‘సర్‌’ అనేది బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన సేవలకు ఇచ్చిన గౌరవ పురస్కారం. చాలా హాలీవుడ్‌ సినిమాల్లో విలన్‌గా, క్రూరుడిగా ఆయనను చూసిన ఆనాటి ప్రేక్షకులు భయపడేవారంటే ఆయా పాత్రల్లో ఆయనెంత చక్కగా ఇమిడిపోయారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న ‘ద లార్డ్‌ ఆఫ్‌ద రింగ్స్‌’, ‘ద హోబిట్‌’, ‘ద మ్యాన్‌ విత్‌ ద గోల్డెన్‌ గన్‌’, ‘స్టార్‌వార్స్‌’లాంటి చిత్రాలు ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌ స్థాపకుడు మొహమ్మద్‌ అలీ జిన్నా బయోపిక్‌ ‘జిన్నా’(1998)లో ఆయన నటన అత్యున్నత ప్రమాణాలను అందుకుంది. ఈయన రెండు దశాబ్దాల పాటు డ్రాకులా పాత్రలే ధరించడం విశేషం. లండన్‌లో 1922 మే 27న పుట్టిన క్రిస్టోఫర్‌లీ వెండితెరపై విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసి 2015 జూన్‌ 7న తన 93వ ఏట మరణించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.