బుల్లితెరైనా... వెండితెరైనా...
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 256 ఆడిషన్స్‌కి హాజరయ్యాడు అతడు... కానీ ఎందులోనూ ఎంపిక కాలేదు. మరెవరైనా అయితే నిరాశతో వెనుతిరిగేవారే. కానీ అతడు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నించి చివరకి అనుకున్నది సాధించాడు... అదే నటుడు కావడం! అభినయం మీద అతడికున్న మక్కువ అలాంటిది. ఆపై అంచెలంచెలుగా ఎదుగుతూ టీవీల ద్వారా ఇంటింటి వీక్షకులను, వెండితెర ద్వారా సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. అతడే ల్యూక్‌ పెర్రీ. ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘బఫీ ద వాంపైర్‌ స్లేయర్‌’, ‘8 సెకండ్స్‌’, ‘ద ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’, ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’, ‘టెర్మినల్‌ బ్లిస్‌’, ‘ఇన్వేషన్‌’, ‘రియోట్‌’, ‘స్టార్మ్‌’లాంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందాడు. అంతకు ముందు ‘బెవెర్లీ హిల్స్‌’ టీవీ సీరియల్‌లో డైలన్‌ మెకే పాత్ర ద్వారా ‘టీన్‌ ఐడల్‌’గా యువతను ఆకట్టుకున్నాడు. ఇంకా ఎన్నో టీవీ కార్యక్రమాల ద్వారా అలరించాడు. ఓసారి అతడి ఆటోగ్రాఫ్‌ కోసం ఏకంగా 10,000 మంది అమ్మాయిలు క్యూకట్టారంటే అతడి ప్రాచుర్యం ఎంతటి స్థాయికి ఎదిగిపోయిందో ఊహించవచ్చు!

అమెరికాలో 1966 అక్టోబర్‌ 11న పుట్టిన పెర్రీ, చిన్నతనంలో నిలదొక్కుకోడానికి నానా కష్టాలూ పడ్డాడు. ఎవేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అరకొర సంపాదనతో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పుడే అతడి దృష్టి నటనపై పడింది. మంచి నటుడిగా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న ఇతడు తన 52వ ఏట 2019 మార్చి 4న అనూహ్యంగా మెదుడులో నరాలు చిట్లడం వల్ల మరణించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.