చార్లీ చాప్లిన్‌ సరసన...

ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన హాస్య నటుడిగా పేరొందిన చార్లీ చాప్లిన్‌ కొన్ని మామూలు సినిమాల్లో కూడా నటించాడని కొంతమందికి మాత్రమే తెలుసు. అలా నటించేప్పుడు అతడి జోడీగా నటించిన నటిగా మేరీ డ్రెస్లర్‌ను చెప్పుకోవాలి. మూకీల కాలంలోనే ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్న ఈమె ‘టిల్లీస్‌ పంక్చర్డ్‌ రొమాన్స్‌’ సినిమాలో చార్లీ చాప్లిన్‌తో కలిసి నటించి మెప్పించింది. నాటక రంగంలో కూడా మంచి పేరు సంపాందింది. సినీ చరిత్రలో తొలి పూర్తి నిడివి గల హాస్య చిత్రంలో నటించిన ఘనత ఆమెదే. కెనడాలో 1868 నవంబర్‌ 9న పుట్టిన ఈమె పద్నాలుగేళ్లకే ఇంటి నుంచి బయటకి వచ్చేసి నాటకాల్లో పాత్రలు ధరించిన సాహసికురాలు. అంత అందంగా లేకపోయినా ప్రేక్షకులను తన హావభావాలతో విపరీతంగా నవ్వించి రాణించింది. కొంతకాలం చిత్రాలకు దూరమైనా తిరిగి 59వ ఏట మళ్లీ వెండితెరపై మెరిసిన ఈమె ‘మిన్‌ అండ్‌ బిల్‌’ సినిమాకు ఆస్కార్‌ అందుకుంది. ప్రఖ్యాత ‘టైమ్‌’ పత్రికలో ముఖచిత్ర కథనంతో ప్రపంచం దృష్టికి ఆకట్టుకున్న ఆమె, 1934 జులై 28న తన 65వ ఏట కాలిఫోర్నియాలో మరణించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.