నవ్వులే అతడి సోపానాలు


హాస్యమే అతడి జీవితాన్ని తీర్చిదిద్దింది. నవ్వులు పంచే ప్రతిభే అతడికి సోపానాలు వేసింది. అతడే రిక్‌ మొరానిస్‌. ప్రపంచ దేశాల్లో మంచి చిత్రాలుగా పేరొందిన ‘ఘోస్ట్‌ బస్టర్స్‌’, ‘హనీ ఐ ష్రంక్‌ ద కిడ్స్‌’, ‘స్పేస్‌ బాల్స్‌’, ‘లిటిల్‌ షాప్‌ ఆఫ్‌ హారర్స్‌’, ‘స్ట్రేంజ్‌ బ్రూ’, ‘పేరెంట్‌హుడ్‌’, ‘మై బ్లూ హెవెన్‌’, ‘ద ఫింట్‌స్టోన్స్‌’ లాంటి ఎన్నో సినిమాలతో అలరించాడు. కెనడాలో 1953 ఏప్రిల్‌ 18న పుట్టిన ఇతడు చిన్నప్పుడే రేడియో డిస్క్‌ జాకీగా ఆకట్టుకున్నాడు. స్నేహితులతో కలిసి హాస్య రూపకాలు రూపొందించి ప్రదర్శనలు ఇచ్చేవాడు. టీవీల ద్వారా ఇంటింటికా నవ్వులు పంచాడు. అలా వెండితెరకు పరిచయమై ఎన్నో సినిమాల్లో హాస్యభరితమైన పాత్రలు పోషించాడు. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు పొందాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.