ఇంజినీర్‌ అవుదామనుకుని...

కేంబ్రిడ్జ్‌లో ఇంజినీరింగ్‌ చదివి ఇంజినీర్‌ అవ్వాలనుకున్న ఓ కుర్రాడి కలలు, తండ్రి మరణంతో ఆవిరయ్యాయి... అయితే వెండితెర అతడికి ఎర్రతివాచీ పరిచి, ఉత్తమ నటుడిగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది... రొనాల్డ్‌ కోల్‌మన్‌ అంటే చాలు హాలీవుడ్‌ సినిమా అభిమానులకు మంచి సినిమాలు కళ్ల ముందు మెదులుతాయి. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయిన అతడికి నాటకం మంచి ఉపాధినిచ్చింది. వేదికలపై నాటకాలు వేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై టీవీల్లో మెరిశాడు. తరువాత నిశ్శబ్ద చిత్రాల నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. మూడు దశాబ్దాల పాటు ‘బుల్‌డాగ్‌ డ్రమ్మండ్‌’ (1929), ‘కండెమ్న్‌డ్‌’, ‘రాండమ్‌ హార్వెస్ట్‌’, ‘ఎ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌’, ‘లాస్ట్‌ హారిజన్‌’, ‘ద ప్రిజనర్‌ ఆఫ్‌ జెండా’, ‘కిస్మత్‌’, ‘ఎ డబుల్‌ లైఫ్‌’ లాంటి సినిమాల్లో నటించి అకాడమీ, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు గెల్చుకున్నారు. యుకెలో 1891 ఫిబ్రవరి 9న పుట్టిన ఇతడు కాలిఫోర్నియాలో 1958 మే 19న తన 67వ ఏట మరణించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.