విలక్షణ ప్రయాణం

నటుడిగా, కమేడియన్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖమైన ప్రస్థానం సచా బారన్‌ కొహెన్‌ది. ఇంగ్లీషు నటుడైన ఇతడు నాటకం, బుల్లితెర, సినిమా రంగాల్లో విలక్షణంగా పేరు తెచ్చుకున్నాడు. ఆస్కార్‌ నామినేషన్‌ సహా బాఫ్టా, గోల్డెన్‌గ్లోబ్‌ లాంటి అవార్డులు అందుకున్నాడు. ‘అలీ జీ’, ‘బోరట్‌ సగ్‌దియేవ్‌’, ‘బ్రూనో గెహార్డ్‌’, ‘ఎడ్మైరల్‌ జనరల్‌ అలాదీన్‌’లాంటి పాత్రల ద్వారా అభిమానులకు గుర్తుండిపోయాడు. సినిమాల్లో ‘మడగాస్కర్‌’, ‘టల్లాడిగా నైట్స్‌: ద బేలడ్‌ ఆఫ్‌ రికీ బాబీ’, ‘స్వీనీ టాడ్‌: ద డెమన్‌ బార్బర్‌ ఆఫ్‌ ఫ్లీట్‌ స్ట్రీట్‌’, ‘హగో’, ‘యాంకర్‌మేన్‌: ద లెజెండ్‌ కంటిన్యూస్‌’ ‘గ్రిమ్స్‌బీ’, ‘ఎలైస్‌ త్రూ ద లుకింగ్‌ గ్లాస్‌’లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌లో 1971 అక్టోబర్‌ 13న పుట్టిన ఇతగాడు డిగ్రీ పూర్తయిన తర్వాత నటనపై దృష్టి పెట్టి నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై బుల్లితెర, వెండితెరలపై తనదైన ముద్ర వేయగలిగాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.