హత్యకు గురైన అందాల నటి!

అందాల పోటీల్లో ఆమె గెలుచుకున్న ఎన్నో బహుమతుల్లో మొదటిదాన్ని ఆరు నెలల వయసులోనే పొందింది. ముద్దులు మూట గట్టే ఆ పాపకి ‘మిస్‌ టినీటాట్‌ ఆఫ్‌ డల్లాస్‌’ అనే బిరుదు నిచ్చారు. ఎదుగుతున్న కొద్దీ అందాల పాపగా, చూడచక్కని అమ్మాయిగా, సొగసుల భామగా ఎన్నో పతకాలు. ఆపై వెండితెరపై కూడా తారగా మెరిసింది. ఆమే షరాన్‌ టేట్‌. డల్లాస్‌లో 1943 జనవరి 24న అమెరికా సైనికాధికారి కూతురుగా పుట్టిన షరాన్‌ తండ్రి ఉద్యోగ రీత్యా ఎన్నో ప్రాంతాల్లో ఎదిగింది. అందం, ఆకట్టుకునే రూపం కలిగిన ఆమెకు ఫ్యాషన్‌ రంగం, బుల్లితెర, వెండితెర కూడా ఎర్రతివాచీలు పరిచాయి. మోడల్‌గా ఎన్నో పత్రికల ముఖపత్రాలపై మెరిసింది. ‘బరబ్బాస్‌’ (1961) సినిమాతో యాంటోనీక్విన్‌ సరసన తొలిసారిగా నటించిన షరాన్, ‘ఐ ఆఫ్‌ ద డెవిల్‌’, ‘వేలీ ఆఫ్‌ ద డాల్స్‌’, ‘ద ఫియర్‌లెస్‌ వేంపైర్‌ కిల్లర్స్‌’లాంటి సినిమాల్లో నటించింది. దర్శకుడు రోమన్‌ పొలాన్‌స్కీని 1968లో పెళ్లి చేసుకుంది. కానీ కేవలం తన 26 ఏళ్ల వయసులో ఎనిమిది నెలల గర్భిణిగా ఉండగా 1969 ఆగస్ట్‌ 9న కొందరు దుండగులు చేసిన దాడిలో మరో నలుగురు కుటుంబ సభ్యులతో సహా హత్యకు గురైంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.