ఆస్కార్‌ అందుకున్నఫ్రెంచి అందం

ప్ర
పంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు అందుకున్న ఫ్రెంచి నటి సైమోన్‌ సిగ్నోరెట్‌. ‘రూమ్‌ ఎట్‌ ద టాప్‌’ చిత్రానికి ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్‌ అందుకుంది. ఆస్కార్‌తో పాటు రెండు సీజర్స్, మూడు బాఫ్టా, ఎమ్మీ, కేన్స్‌ చిత్రోత్సవం, సిల్వర్‌ బేర్, ఎన్‌బీఆర్‌లాంటి అవార్డులు కైవసం చేసుకుంది. జర్మనీలో 1921 మార్చి 25న పుట్టిన ఈమె, ప్యారిస్‌లో పెరిగింది. ఫ్రాన్స్‌ను జర్మనీ ఆక్రమించినపుపడు ఆమె కొందరు కళాకారుల బృందంలో సభ్యురాలిగా మారింది. అక్కడే నటన పట్ల ఆసక్తి పెంచుకుంది. ‘ఫిప్‌ ఆఫ్‌ ఫూల్స్‌’, ‘గుడ్‌బై లియోనార్డ్‌2’, ‘ద ఐడియల్‌ కపుల్‌’, ‘బ్యాక్‌ స్ట్రీట్స్‌ ఆఫ్‌ ప్యారిస్‌’లాంటి సినిమాలతో ప్రపంచ గుర్తింపు పొందింది. అందం, అభినయాలతో ఆకట్టుకున్న ఈమె 1985 సెప్టెంబర్‌ 30న తన 64వ ఏట ఫ్రాన్స్‌లో మరణించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.