స్వర్ణయుగంలో గొప్ప నటుడు

హాలీవుడ్‌లో క్లాసిక్‌ సినిమాలు తెరకెక్కిన కాలంలో ఓ గొప్ప నటుడిగా పేరు పొందాడు స్పెన్సర్‌ ట్రేసీ. రెండు ఆస్కార్‌ అవార్డులు సహా మరెన్నో పురస్కారాలు అతడి అభినయ కౌశలానికి గీటురాళ్లు. కాలేజీ రోజుల్లోనే నాటకాల ద్వారా నటుడైన ట్రేసీ, ‘అప్‌ ద రివర్‌’ (1930) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆపై ‘ద పవర్‌ ఆఫ్‌ ద గ్లోరీ’, ‘కెప్టెన్స్‌ కరేజియస్‌’, ‘బోయ్స్‌ టౌన్‌’, ‘గెస్‌ హూ ఈజ్‌ కమింగ్‌ టు డిన్నర్‌’లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అమెరికాలో 1900 ఏప్రిల్‌ 5న పుట్టిన ఇతడు ‘గ్రేటెస్ట్‌ మేల్‌ స్టార్‌ ఆఫ్‌ హాలీవుడ్‌ గోల్డెన్‌ ఎరా’గా గుర్తింపు తెచ్చుకుని, 1967 జూన్‌ 10న కాలిఫోర్నియాలో తన 57వ ఏట మరణించాడు.

                                   




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.