మూడు రంగాల ముద్దుగుమ్మ

నాటకం, టీవీ, సినిమా... ఈ మూడు వినోద రంగాల్లో అందాల భామగా, అభినయంలో మేటిగా గుర్తింపు పొందింది జెనే టియర్నీ. మూడు రంగాల్లోనూ అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ‘గ్రేట్‌ బ్యూటీ’గా ఆమెను అభివర్ణించేవారు. ‘లారా’, ‘లీవ్‌ హెర్‌ టు హెవెన్‌’, ‘హెవెన్‌ కెన్‌ వెయిట్‌’, ‘ద రేజర్స్‌ ఎడ్జ్‌’, ‘ద ఘోస్ట్‌ అండ్‌ మిసెస్‌ ముయిర్‌’, ‘వర్ల్‌పూల్‌’, ‘ద లెఫ్ట్‌హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ సినిమాల్లో పాత్రలు ఆమెకు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని తీసుకువచ్చాయి. న్యూయార్క్‌లో 1920 నవంబర్‌ 19న పుట్టిన ఈమె, చిన్నప్పుడే నాటక రంగం వైపు ఆకర్షితురాలైంది. ఆమె అందం, అభినయం ఆమెకు ఎర్రతివాచీలు పరిచాయి. బుల్లితెరపై కూడా ఆకట్టుకున్న ఆమె సినీ రంగంలోకి అడుగు పెట్టి తారగా ఎదిగింది. అయితే సిగరెట్లు, తాగుడు వంటి అలవాట్ల వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మానసికంగా కుంగుబాటుకు కూడా గురైంది. కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులకు అలరించిన ఈమె 1991 నవంబర్‌ 6న తన 70వ ఏట మరణించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.