మౌగ్లీ కథకు నాంది

పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షించిన ‘జంగిల్‌ బుక్‌’ కథ గుర్తుందా? దాన్ని 1942లోనే ఓ సినిమాగా అందించిన దర్శకుడు జోల్టాన్‌ కోర్డా జయంతి (1895). హంగరీ నుంచి హాలీవుడ్‌ వచ్చిన ఈయన ‘ఎలిఫెంట్‌బాయ్‌’, ‘ద ఫోర్‌ ఫెదర్స్‌’ లాంటి సినిమాలతో ప్రసిద్ధుడు. రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ రాసిన ‘ద జంగిల్‌ బుక్‌’ అనే నవల ఆధారంగా తీసిన జంగిల్‌బుక్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. అడవిలో జంతువుల మధ్య పెరిగి మౌగ్లీ పాత్ర ఈ సినిమాతో ఇంటింటి పేరుగా మారిపోయింది. ఈ సినిమా నాలుగు ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.