గిన్నిస్‌ రికార్డులకెక్కి...బాత్‌టబ్‌లో మునిగి!
- అత్యధిక అవార్డులు అందుకున్న మహిళగా గిన్నిస్‌ రికార్డు ఆమె సొంతం!
- అత్యధిక అమ్మకాలు సాధించిన గాయనిగా ప్రపంచ రికార్డు ఆమెదే!
- గాయనిగా, వెండితెర నటిగా వెలిగిన ప్రాచుర్యం ఆమెది!
- ఇవన్నీ విట్నీ హౌస్టన్‌ ఘనతలే!


హై
స్కూలు రోజుల్లోనే గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది. పంతొమ్మిదేళ్లకల్లా సొంతంగా రెండు ఆల్బమ్స్‌ విడుదల చేస్తే అవి రెండూ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోనే బెస్ట్‌ సెల్లింగ్‌ ఆల్బమ్స్‌గా నిలిచాయి. ఓ వేపు సంగీత సునామీలు సృష్టిస్తూనే ‘ద బాడీగార్డ్‌’ (1992) సినిమా సౌండ్‌ట్రాక్‌ కోసం ఏడు పాటలు రికార్డు చేస్తే అది కూడా అమ్మకాల్లో సంచలనం సృష్టించింది. ‘వెయిటింగ్‌ టు ఎక్జేల్‌’, ‘ద ప్రీచర్స్‌ వైఫ్‌’లాంటి సినిమాల్లో మెరిసింది. ఆమె వెలువరించిన ఏడు స్టూడియో ఆల్బమ్స్, రెండు సౌండ్‌ట్రాక్‌ ఆల్బమ్స్‌ కూడా డైమండ్, మల్టీ ప్లాటినం, ప్లాటినం, గోల్డ్‌ రికార్డులు సాధించడం విశేషం. చిన్న వయసులోనే తారాపథానికి దూసుకుపోయిన ఈ సంచలన తార అనూహ్యంగా మరణించడం విషాదం. న్యూజెర్సీలో 1963 ఆగస్టు 9న పుట్టిన విట్నీ, 2012 ఫిబ్రవరి 11న తన 48 ఏళ్ల వయసులో బాత్‌టబ్‌లో మునిగిపోయి చనిపోయింది. మత్తుపదార్థాల వాడకంతో గుండె ఆగిపోవడమే కారణం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.