సినిమా పుట్టుపూర్వోత్తరాలు − 11
article image
ఇంగ్లం‌డ్‌లోని సినీ స్టూడి‌యో‌లకు శ్రీకారం చుట్టి‌న వాడు సిసిల్‌ హెప్‌వర్త్‌. 1898లో లండ‌న్‌లో థేమ్స్‌ నది ఒడ్డు‌మీద ఒక ఇంటి‌ని‌కొని, ఆ ఇంటి పెర‌టి‌తో‌టలో హెప్‌వర్త్‌ సిని‌మాలు తీసే‌వాడు.‌ పెరడు చిన్న‌దిగా ఉండ‌టంతో తప్ప‌ని‌సరై సిసిల్‌ హెప్‌వర్త్‌ పెరట్లో ఒక చిన్న స్టేజీ కట్టాడు.‌ 10×10 అడు‌గుల సైజులో ఉండే ఈ స్టేజీ‌ మీ‌ద పెయిం‌ట్స్‌‌ వే‌సిన బొమ్మల్ని, చెక్కల్ని నిల‌బెట్టి, కథకు అను‌గు‌ణ‌మైన ‌‘బాక్‌డ్రాప్‌’‌ను సృష్టిం‌చు‌కొ‌నే‌వా‌డా‌యన.‌ ఇప్ప‌టికీ మన స్టూడి‌యోలు చాలా‌ వా‌టిల్లో ఇదే పద్ధతి ఉండటం విశేషం.‌ చెక్కలు నిటా‌రుగా నిల‌బ‌డ‌టా‌నికి వీలుగా వెను‌క‌వైపు దన్నుగా కర్రల్ని పెట్టే‌వా‌డా‌యన.‌ ఆ తర్వాత హెప్‌వర్త్‌ ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని కూడా కొని స్టూడి‌యోను విస్త‌రిం‌చాడు.‌ ఈ స్టూడియో ‘వాల్డన్‌ స్టూడియో’‌గా ఇప్ప‌టి‌కీ బ్రిట‌న్‌లో సినిమా నిర్మా‌ణంలో ముందునే ఉంది.‌

అచ్చం హెప్‌వ‌ర్త్‌‌లానే విల్‌ బార్కర్‌ అనే మరో పెద్ద‌మ‌నిషి లండ‌న్‌లో ఇంకో స్టూడియో కట్టాడు.‌ ఇది నేటికీ చాలా బిజిగా ఉండే స్టూడి‌యోల్లో ఒక‌టిగా నిలు‌స్తోంది. 1899 రాబ‌ర్ట్‌‌పాల్‌ ఒక స్టూడి‌యోను న్యూసౌ‌త్‌గే‌టు‌ వద్ద నిర్మించి సిని‌మాలు తీసే‌వాడు.‌ తనకు అవ‌సరం లేన‌పుడు స్లూడి‌యోను ఆయన ఇతర నిర్మా‌త‌లకు అద్దెకు ఇచ్చే‌వాడు.‌ స్టూడి‌యో‌లను ఇత‌రులకు అద్దె‌కి‌వ్వ‌ట‌మనే వ్యాపా‌రా‌నికి ఇలా శ్రీకారం చుట్టి‌న‌వాడు రాబ‌ర్ట్‌‌పాల్‌.
ఛార్లెస్‌ వధె 1906లో పారి‌స్‌లో కట్టిన స్టూడియో గురించి చెప్పు‌కో‌వడం అవ‌సరం.‌ చాలా‌వ‌రకు ఇదొక ‌‘గ్లాస్‌హౌస్‌’‌లాగ ఉండేది.‌ సిని‌మా‌లను పగ‌టి‌వేళే తీసే‌వారు.‌ అయితే ఇందులో అవ‌స‌రా‌నికి తగిన సెట్‌ వేసు‌కో‌వ‌డా‌నికి సరి‌ప‌డేంత జాగా ఉండేది.‌ బొమ్మలో ఒక షాపు సెట్‌ను చూడొచ్చు.‌ స్టూడి‌యోలో ఫ్లోర్‌లో ఒక‌వైపు షూటింగ్‌ జరు‌గు‌తోంటే మరో‌వైపు మరో సన్ని‌వే‌శా‌నికి అవ‌స‌ర‌మైన సెట్టింగ్‌ వేసే‌వారు.‌ స్టూడి‌యోలో కప్పు‌కింద క్యాట్‌వాక్స్‌ ఉండేవి.‌ వాటిని ఫ్లోర్‌ ఆవ‌ర‌ణలో ఎటు కావా‌లంటే అటు జరు‌పు‌కొనే వీలుం‌డేది.‌ సెట్ల నిర్మా‌ణా‌నికి నాంది‌ప‌లికి స్టూడియో ఇదే కావటం దీని ప్రత్యే‌కత.
article image
1914 నాటికి స్టూడి‌యోలు చాలా‌వ‌రకు నేటి రూపాన్ని సంత‌రిం‌చు‌కో‌గ‌లి‌గా‌యని చెప్పాలి.‌ అప్పట్లో సిని‌మా‌లన్నీ ఒక రీలు సిని‌మా‌లు‌గానే ఉండేవి.‌ ఒక్కో సినిమా తీయ‌టా‌నికి మూడు‌నా‌లుగు రోజు‌లుప‌ట్టేది.‌ అంత సమయం దేని‌కని భావిం‌చిన కొందరు ఒకేసారి ఒకే స్టూడి‌యోలో రెండే‌సి‌చోట్ల షూటిం‌గ్‌ ‌చే‌సే‌వారు.‌ ‌‘సెకండ్‌ యూనిట్స్‌’‌ రంగ‌ప్రవే‌శం‌ చే‌శాయి.‌ బొమ్మలో ఒక సెట్టిం‌గ్‌ ‌మీద రెండు యూనిట్స్‌ ఒకేసారి షూటిం‌గ్‌జ‌ర‌పడం చూడొచ్చు.‌ స్టూడి‌యోలు అప్ప‌టికీ ఇంకా గ్లాస్‌హౌ‌స్‌లా‌గానే ఉండేవి, కానీ స్టూడి‌యోల్లో కృతిమ దీపాలు వచ్చే‌శాయి.‌ ఆర్క్‌ లైట్లు పెరి‌గాయి.‌ ఆర్క్‌‌లైట్ల సాయంతో బయట వాతా‌వ‌ర‌ణం ఎలా ఉన్నా‌సరే, సినిమా స్టూడి‌యోల్లో మాత్రం నిరా‌ఘా‌టంగా షూటింగ్‌ జరి‌గి‌పో‌యేది.‌ ఈ లైట్ల సాయంతో కేమే‌రా‌మ‌న్‌లు తమకు అవ‌స‌ర‌మైన ‌‘లైటింగ్‌ ఎఫె‌క్ట్‌¬్స’‌ను కూడా సమ‌కూ‌ర్చు‌కొ‌నే‌వారు.‌

సిని‌మాల్లో ‌‘శబ్దం’‌ చోటు‌చే‌సు‌కొ‌నే‌స‌రికి స్టూడియో నిర్మా‌ణంలో కొన్ని మార్పులు చేర్పులు తప్ప‌ని‌స‌ర‌యి‌నాయి. 1930 నాటికి స్టూడియో రూపు‌రే‌ఖలు చాలా మారాయి.‌ శబ్దం రికా‌ర్డిం‌గ్‌ ‌కోసం ‌‘మైక్రో‌ఫోన్లు’‌ వేలా‌డ‌దీ‌సే‌వారు.‌ కేమేరా తిరు‌గు‌తోంటే.. అది తిరిగే శబ్దం రికార్డు కాకుండా ఉండేం‌దుకు కెమేరా యూని‌ట్‌నంతా ఒక ‌‘గ్లాస్‌ బూత్‌’‌లో ఉంచే‌వారు.‌ స్టూడి‌యోల శబ్దా‌నికి ప్రతి‌ధ్వ‌నులు రాకుండా కెమేరా వెనుక పెద్ద ‌‘బాఫుల్‌’‌ వాల్‌ ఉంచే‌వారు.‌ ఆర్క్‌ లైట్ల‌నుంచి వచ్చే శబ్దం కూడా రికార్డు అవు‌తోం‌దనే భయంతో ఆర్క్‌ లైట్లను పూర్తిగా తొల‌గించి, ఇన్‌కాం‌డసెంట్‌ లైట్స్‌ పెట్టారు.‌ వీటిని ఆరో‌జుల్లో ‌‘ఇంకీస్‌’‌ అని పిలి‌చే‌వారు.‌

ఇప్పటి స్టూడి‌యోల్లో పద్ధ‌తు‌లన్నీ పూర్తిగా మారి‌పో‌యాయి.‌ వంద‌ల‌మంది ఒకే‌సారి పాల్గొ‌న‌గ‌లిగే సన్ని‌వే‌శా‌లను సైతం చిత్రీ‌క‌రిం‌చ‌గల అవ‌కా‌శాలు నేటి స్టూడి‌యోల్లో ఉన్నాయి.‌ గాలీ‌వానా, వర్షం‌తో‌పాటు ఏవైనా సరే స్టూడియో ఫ్లోర్‌లోనే సృష్టిం‌చ‌గల శక్తి‌స్థో‌మ‌తలు మనకొచ్చాయి.‌ ఎంద‌రెం‌దరో పెద్దలు సినీ నిర్మా‌ణ‌రంగం తొలి రోజుల్లో వేసిన తప్ప‌ట‌డు‌గుల ఆధా‌రం‌గానే ఈనాడు సినిమా పరి‌శ్రమ పూర్తిగా నిల‌దొ‌క్కు‌కొం‌దని చెప్ప‌టమే పై చరి‌త్రను చెప్ప‌డంలో అసలు ఉద్దేశం‌!! (సశేషం)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.