సినిమా పుట్టుపూర్వోత్తరాలు − 8
లుమి‌యర్‌ సోద‌రులు పారి‌స్‌లో బాగా స్థిర‌ప‌డ్డారు.‌ తమ ‌‘సిని‌మా‌టో‌గ్రాఫ్‌’‌ ప్రద‌ర్శ‌న‌లకు కావ‌ల్సిన చల‌న చి‌త్రా‌ల‌ కోసం వారు కొందరు కెమే‌రా‌మె‌న్‌లను ప్రపం‌చం‌లోని నలు‌మూ‌ల‌లకూ పంపిం‌చారు.‌ ఏడాది తిరి‌గే‌స‌రికి లుమి‌యర్‌ సోద‌రులు దగ్గర దాదా‌పుగా 800 పైచి‌లుకు చిత్రాలు సిద్ధమ‌య్యాయి.‌

article image
లుమి‌యర్‌ శిష్యుల్లో ఒకడు మాన్వి‌యర్‌ (మిస్టర్‌) ప్రొమియో.‌ చల‌న‌ చిత్ర చరి‌త్రలో ఆయ‌న‌కెంతో ప్రత్యే‌క‌ స్థానం ఉంది.‌ ఒక‌సారి ఆయన వెనిస్‌ (ఇటలీ) లోని నగ‌ర‌ వీ‌ధుల్లో గొండోలా అనే పడ‌వలో (అక్కడ వీధు‌లన్నీ జల‌మా‌ర్గాలే) విహ‌రి‌స్తోంటే ఆయ‌నకో ఐ‌డి‌యా ‌వ‌చ్చింది.‌ ‌‘ఎంత‌సే‌పూ కెమే‌రాను చేత్తో పట్టు‌కొని దాని హేండిల్‌ తిప్పుతూ కూర్చో‌వ‌ట‌మేనా! దీనికి వేరే‌మార్గం అనే‌దే‌ లేదా!’‌ అన్నదే ఆయ‌న‌కొ‌చ్చిన ఆలో‌చన.‌ వెంటనే ఆయన తన చేతి‌లోని కెమే‌రాను గొండోలా పడవ అంచుకు కట్టే‌సాడు.‌ పడవ నడు‌స్తుంటే చిత్రీ‌క‌రణ సాగు‌తూ‌వ‌చ్చింది.‌ పూర్త‌య్యాక, వాటిని డెవ‌లప్‌ చేసి‌చూస్తే నది‌ప‌క్కన నెమ్మ‌దిగా కదు‌లు‌తున్న రీతిలో భవ‌నాలు కని‌పిం‌చాయి.‌ ఆ షాట్‌ చాలా అద్భు‌తంగా వచ్చింది.‌ దాంతో ‌‘మూవింగ్‌ కెమేరా’‌ షాట్స్‌ ఆరం‌భ‌మ‌య్యాయి.‌ అంత‌వ‌రకు కెమేరా ముందు మనుషులో, జంతు‌వులో అవే కది‌లి‌తే‌గాని కెమేరా కద‌లడం అంటూ ఉండే‌ది‌కాదు.‌ కానీ ప్రోమి‌యో‌కొ‌చ్చిన ఆలోచనతో ‌‘మూవింగ్‌ కెమేరా టేకింగ్‌’‌ ఆరం‌భ‌మ‌యింది.‌ ఇప్పుడు గనుక మనం సిని‌మా‌కెళ్ళి చూస్తే ఏ సిని‌మా‌లో‌నైనా సరే కెమేరా కొన్ని సెక‌న్ల‌కన్నా ఎక్కు‌వ‌కాలం నిల‌క‌డగా ఉండ‌క‌పో‌వడం మన‌క‌ర్థ‌మ‌వు‌తుంది.‌ కొన్ని‌సార్లు ఒక నటుడు నడు‌స్తుంటే అత‌ని‌తో‌బాటే కెమేరా కూడా తన దృష్టిని మళ్లిస్తున్న రీతిలో కద‌లటం (దీన్నే సినిమా పారి‌భా‌షి‌క ‌ప‌దజాలంలో ‌‘ప్యానింగ్‌’‌ అంటారు).‌ మరో‌సారి కెమేరా పైనుంచి క్రిందకు వంగటం (దీన్ని ‌‘టిల్టింగ్‌’‌ అంటారు.‌) కొన్ని‌సార్లు నటు‌ల‌ ప‌క్కన అత‌ని‌తో‌పాటే కెమేరా కద‌లటం (దీన్ని ‌‘ట్రాకింగ్‌’‌ అంటారు) ఇంకొ‌న్ని‌సార్లు కెమేరా కొంత ఎత్తులో ఉండి అన్ని దిశ‌ల‌వైపు ఫ్రీగా కద‌లటం (దీన్ని ‌‘క్రేన్‌షాట్‌’‌ అంటారు) వంటి‌వన్నీ మనకు కని‌పి‌స్తుం‌టాయి.‌ ఈ పద్ధ‌తు‌ల‌న్ని‌టికీ శ్రీకా‌రం‌చు‌ట్టిన వ్యక్తి ప్రోమియో.‌

సిని‌మాలో మనకు కని‌పించే మరో ముఖ్య‌మైన పద్ధతి క్లోజ్‌−‌అప్‌ షాట్స్‌.‌ దీనికి ఆద్యుడు జి.‌ఎ.‌స్మిత్‌.‌ ఇప్పుడు సినిమా చూస్తుంటే తెర‌నిం‌డుగా మనకు నటీ‌న‌టుల తల‌కా‌యలు కన‌ప‌డటం మామూ‌ల‌యిం‌ది‌గానీ, ఆ పద్ధ‌తిని జి.‌ఎ.‌స్మిత్‌ తొలి‌సా‌రిగా ‌‘ఎ విటల్‌ డాక్టర్‌’‌ చిత్రంలో ప్రవే‌శ‌పె‌ట్టారు.‌ ఆ చిత్రంలో ఇద్దరు పిల్లలు డాక్ట‌ర్లుగా నటిస్తూ, ఒక పిల్లి‌పి‌ల్లకు ఒక చిన్న చెంచాతో మందు‌ప‌డ‌తారు.‌ మందు‌పో‌స్తు‌న్న‌ప్పుడు పిల్లి‌పి‌ల్లను మరీ ‌ద‌గ్గ‌రగా స్మిత్‌ ఫోటో తీస్తాడు.‌ ఇదే ప్రపంచ సినీ చరి‌త్రలో తొలి క్లోజప్‌ షాట్‌.‌

సినిమా తీయ‌టంలో సరే, సిని‌మాలు చూపిం‌చ‌టంలో కూడా ఆనాటి ఔత్సా‌హి‌కులు కొందరు కొన్ని ప్రయో‌గాలు చేసే‌వారు.‌ అలాంటి‌వా‌రిలో చెప్పు‌కో‌దగ్గ వ్యక్తి జార్జె‌హెల్‌ అనే అమె‌రి‌కన్‌.‌ ఆయన తన సిని‌మా‌హా‌ల్‌ను ఒక రైల్వే‌కా‌రేజ్‌ రూపంలో ఏర్పాటు చేయిం‌చాడు.‌ దీంట్లో ఒక‌వై‌పున తెర ఉండేది.‌ రెండో వైపున ప్రేక్ష‌కులు కూర్చు‌నేం‌దుకు కుర్చీ‌లుం‌డేవి.‌ తెర‌మీద −‌ రైలు ముందు కెమేరా పెట్టి తీసిన దృశ్యా‌లను ప్రొజెక్ట్‌ చేసే‌వాడు.‌ దీంతో ప్రేక్ష‌కు‌లకు తాము స్వయంగా ప్రయాణం చేస్తున్న అనుభూ‌తి‌ క‌లు‌గు‌తుం‌డేది.‌ మరి‌కొంత ఎఫె‌క్ట్‌ ‌కోసం రైలు నడు‌స్తు‌న్న‌ప్పుడు వచ్చే శబ్దం, విజి‌ళ్ళను సైతం విని‌పిం‌చే‌వాడు.‌ ఇలాంటి ప్రద‌ర్శ‌నలు ఒక విహా‌ర‌యాత్ర తీరు‌లో‌సా‌గేవి.‌ కాబట్టి వీటిని ‌‘హేల్స్‌‌టూర్‌’‌ అని వ్యవ‌హ‌రిం‌చే‌వారు.‌ అమె‌రి‌కా‌లోనూ, మరి‌న్ని‌చోట్ల ప్రజలు చాలా‌మంది తమ తొలి చిత్రాన్ని ‌‘హేల్‌టూ‌ర్‌్్స’‌లోనే చూసి ఉంటారు.
సరే.‌.‌.‌ మళ్లీ మనం ఒక్క‌సారి జార్జె‌స్‌మి‌లి‌స్‌ను గుర్తు చేసు‌కొందాం.‌ పారి‌స్‌లో ‌‘గ్రాండ్‌కేఫ్‌’‌ లోని తొలి ‌‘సిని‌మా‌టో‌గ్రాఫ్‌’‌ ప్రద‌ర్శ‌న‌నను చూసి‌న‌వా‌ళ్ళలో జార్జెస్‌ మిలిస్‌ ఒక‌డని ముందే చెప్పుకున్నాం కదా! అతను తనకా టెక్ని‌క్‌ను అమ్మా‌ల్సిం‌దిగా లుమి‌యర్‌ బ్రద‌ర్స్‌ను ఎంత‌గానో అడి‌గినా, వాళ్ళు ఒప్పు‌కో‌లేదు.‌ ఫలితంగా జార్జె‌స్‌మి‌లిస్‌ నిరా‌శతో తిరి‌గి‌వ‌చ్చే‌వాడు.‌ కానీ దేన్నీ అంత‌తే‌లిగ్గా వదిలే మని‌షి‌కా‌డ‌తను.‌ లుమి‌యర్‌ తనకు ‌‘సిని‌మా‌ట్రో‌గ్రాఫ్‌’‌ను అమ్మ‌క‌పో‌యినా అలా‌ంటి వాటినే రాబ‌ర్ట్‌‌పాల్‌ తయా‌రు‌చే‌శా‌డని విన్నాడు.‌ పారి‌స్‌కు ఒక‌సారి రాబ‌ర్ట్‌‌పాల్‌ వచ్చి‌న‌ప్పుడు వెయ్యి ఫ్రాంకు‌లకు ఒక ప్రాజె‌క్ట‌రును ఆయన దగ్గ‌ర్నుంచి జార్జె‌స్‌మి‌లిస్‌ కొన్నాడు.‌

ఒక యంత్రాన్ని కొంటే దాన్ని పూర్తిగా విప్పి, మళ్లీ అసెం‌బుల్‌ చేయ‌ట‌మనే హాబీ చాలా‌మం‌దికి ఉంటుంది.‌ జార్జె‌స్‌మి‌లి‌స్‌కు ఆ హాబీ ఉండేది.‌ రాబ‌ర్ట్‌‌పాల్‌ తనకు అమ్మిన ప్రొజె‌క్టర్‌ ను మిలిస్‌ ముందుగా పూర్తిగా విడ‌గొ‌ట్టాడు.‌ తర్వాత దాన్ని మరిన్ని మార్పు‌లతో మళ్లీ అసెం‌బుల్‌ చేసి దానికి ‌‘కిని‌టో‌గ్రాఫ్‌’‌ అని పేరు పెట్టాడు.‌ తర్వాత తను రోజూ ఇచ్చే మాజిక్‌ ప్రద‌ర్శ‌నల్లో దాన్ని ఒక భాగంగా ఏర్పా‌టు‌చే‌శాడు.‌ అయితే రాబ‌ర్ట్‌‌పాల్‌ తీసిన చిత్రాలు అంత బాగా‌లే‌వని నిర్ణ‌యిం‌చు‌కున్న మిలిస్‌ స్వయంగా చిత్రా‌లను తీయా‌ల‌ను‌కు‌న్నాడు.‌ లండ‌న్‌లో 25 వేల ఫ్రాంకు‌లకు ఫిల్మును కొని, దానికి పారి‌స్‌లో రెండు‌వై‌పులా చిల్లుల్ని ఒక కుట్టు‌మి‌ష‌న్‌తో వేయిం‌చాడు.‌ తన ఇంట్లో పెరట్లో సిని‌మాల నిర్మాణం మొద‌లు‌పె‌ట్టాడు.‌

ఒక‌సారి మిలస్‌ సినిమా తీస్తుంటే కెమేరా జామ్‌ అయి‌పో‌యింది.‌ దాన్ని వెంటనే మిలిస్‌ సరి‌చే‌శాడు.‌ మళ్లీ యథా‌ప్రకారం షూటింగ్‌ కొన‌సా‌గించి తర్వాత ఫిల్మును డెవ‌లప్‌ చేసి చూశాడు.‌ చూస్తే ఏముంది.‌ ఫిల్మ్‌ జామ్‌ అవ‌క‌ము‌నుపు ఆయన ఒక బస్సు‌ను ఫిల్మ్‌లో బంధిం‌చగా జామ్‌ అయిన తర్వాత అక్కడ ఆ బస్సు మాయ‌మయి, దాని స్థానంలో శవాల్ని స్మశా‌నా‌నికి తీసు‌కెళ్ళే బండి ప్రత్య‌క్ష‌మ‌యింది.‌ అంటే కెమేరా జామ్‌ అయిన కంగా‌రులో తన కెమేరా ముందు గుర్తిం‌చని కార‌ణం‌గానే అలా జరి‌గిం‌దని మిల‌స్‌కు అర్థమ‌యింది.‌ దీంతో‌బాటు ఆయ‌నకు ఇంకొటీ స్పష్ట‌మ‌యింది.‌ కెమే‌రాను గనుక ఆపి, మళ్ళీ తీస్తే తమా‌షాగా బొమ్మ‌మా‌రి‌పో‌తోం‌దని, ‌‘ట్రిక్‌ఫిల్మ్‌’‌కు ఇదే శ్రీకారం అయింది.‌
జార్జెస్‌ మిలిస్‌ సినిమా రంగా‌నికి ఇచ్చిన వరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.‌ వాటి వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.‌.‌.‌ (సశేషం)


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.