రికా‌ర్డుల మొన‌గాడు.. కృష్ణ
‌‘సాహ‌సమే చేయ్‌రా డింభకా’‌ అంటూ ఘట్ట‌మ‌నేని కృష్ణ చెవిలో సాహ‌స‌లక్ష్మి మంత్రం జపించి ఉంటుంది.‌
అదృ‌ష్ట‌లక్ష్మి ఆయన వెన్ను తట్టి భూమ్మి‌దకు పంపించి ఉంటుంది.‌
విజ‌య‌లక్ష్మి నీతోనే నేనుం‌డి‌పోతా’‌ అంటూ మాటిచ్చి ఉంటుంది.‌
అందుకే తెలుగు సినీ జగ‌త్తులో అని‌తర సాధ్యుడు అని‌పిం‌చు‌కొ‌న్నారు కృష్ణ.
సాహసం ఆయన ఇంటిపేరయ్యింది. విజయం ఆయన్ని వెతుక్కొని మరీ వరించింది.
అందుకే బుర్రి‌పాలెం బుల్లోడు.‌.‌.‌ రికా‌ర్డుల మొన‌గా‌డుగా ఖ్యాతి‌గాం‌చాడు.‌ ఒకటి కాదు.‌
పది కాదు.‌ యాభై ఏళ్ల‌ప్రస్థానం సాగిం‌చడం మాటలా? అది ఎన్టీ‌ఆర్, ఏయ‌న్నా‌ర్‌ల
వంటి దిగ్గ‌జా‌లను దాటు‌కొచ్చి.‌.‌ తన‌కంటూ ఓ స్థానం సంపా‌దిం‌చు‌కో‌వడం నిజంగా
అని‌తర సాధ్య‌మైన చరిత్ర.‌.‌.‌.‌


‘తేనె మన‌సులు’‌ నాటికే అటు ఎన్టీ‌ఆర్‌ ఇటు ఏయన్నార్‌ పోటా పోటిగా సిని‌మాలు చేస్తు‌న్నారు.‌ ‘నెంబర్‌ వన్‌ ఎవ‌రంటే’‌ వీళ్లి‌ద్దరి పేర్లే చర్చకు వచ్చేవి ఒకరు సాంఘికం మరొ‌కరు పౌరా‌ణికం అంటూ ఎవరి సామ్రా‌జ్యాన్ని వాళ్లు సృష్టిం‌చు‌కో‌న్నారు పోనీ ఆ తర‌వాత ప్లేసుతో సరి‌పె‌ట్టు‌కొం‌దా‌మంటే కాంతా‌రావు కత్తి‌ప‌ట్టు‌కొని భయ‌పె‌ట్టే‌స్తు‌న్నాడు.‌.‌.‌ అదీ ఓకే కాంతా‌రావు తర‌వాతి స్థానం ఖాళీగా ఉందా.‌.‌ అంటే శోభ‌న్‌బా‌బులాంటి సాగ్గాడు పోటీకి వచ్చే‌స్తు‌న్నాడు.‌ చలం, హర‌నాథ్, రామ‌కృష్ణ వీళ్లంతా ఎప్పుడు అవ‌కాశం వస్తే అప్పుడు ఎగ‌రే‌సు‌కు‌పోదాం అన్నంత స్టడీగా ఉన్నారు.‌ మరి కృష్ణ స్థానం ఎంత? పదో పద‌కొండో ఆ మాట‌కోస్తే కొత్త‌వాళ్ళు నిల‌దొ‌క్కు‌కో‌వ‌డా‌నికి ఏమాత్రం జాగా లేదు.‌ ప్యాసిం‌జర్‌ రైలు జనా‌లతో కిక్కి‌రి‌సి‌పోయి ఉంటే, మరో పాసిం‌జర్‌ ఎక్కి‌నట్టు కృష్ణ సినిమా ట్రైన్‌ ఎక్కే‌శారు కాలు పెట్ట‌డా‌నికి కుసింత చోటు దక్కితే ఈ భూమం‌డా‌లన్నే ఆక్రమిం‌చే‌సి‌నట్లు ఇంతింతై వటుడింతై విశ్వ‌మం‌తై ఎది‌గి‌పో‌యాడు కృష్ణ. చూస్తుం‌డ‌గానే జన‌రల్‌ బోగీ నుంచి రిజ‌ర్వే‌షన్‌ బోగికి ఆ తరు‌వాత రైలు గమ్యాన్ని మార్చి.‌.‌.‌ కొత్త ట్రాక్‌ ఎక్కించే అంతగా ఎదిగిపోయాడు. ఘట్టమనేని పట్టు‌దల అలాం‌టిది.‌ ఈ యాభై ఏళ్ళ ప్రస్థా‌నా‌నికి తొలి బీజం ‘తేనె మన‌సులు’ చిత్రంతో పండింది.‌ ఆ సినిమా వచ్చి మార్చి 31 నాటికి 50 ఏళ్ళు అంటే కృష్ణ ప్రస్థా‌నా‌నికి అర్ధ శతాబ్దం దాటిందన్నమాట..


* ఏడాదికి పద్నాలుగు, పదిహేను సినిమాలు..
ఈ యాభై ఏళ్లు ఎలా గడి‌చి‌పో‌యాయో తెలీదు తెలుగు సిని‌మాని ఆయన ఎన్ని మెట్లె‌క్కిం‌చారో అసలు గుర్తే లేదు. కానీ చరిత్ర మాత్రం కృష్ణ విజ‌యాలకు సజీవ సాక్ష్యంగా మిగి‌లి‌పో‌యింది.‌ ‘సాక్షి’ ‘గూఢ‌చారి 16’, ‘మోస‌గా‌ళ్ళకు మోస‌గాడు’,‌ ‘పండింటి కాపురం’, ‘దేవుడు చేసిన మను‌షులు’, ‘మాయ‌దారి మల్లి‌గాడు’, ‘అల్లూరి సీతా‌రా‌మ‌రాజు’, ‘భలే‌దొం‌గలు’, ‘కురు‌క్షేత్రం’, ‘సింహా‌సనం’, ‘ఊరికి మొన‌గాడు’.. ఇలా తెలుగు చిత్రసీమ సగర్వంగా చెప్పుకొనే మైలురాళ్లన్నీ కృష్ణ చలవే. రోజుకు మూడు షిఫ్టుల్లో షూటింగ్, ఏడాదికి పద్నాలుగు, పదిహేను సినిమాలు..! ఇవన్నీ ఎవరికి సాధ్యం? అసలు అంతటైమ్‌ ఎ్కడిది? అంత ఓపిక ఎలా వచ్చింది. ‘‘సినిమాలంటే నాకు పిచ్చి ప్రేమ. నచ్చి చేసే పనే కదా..? అందుకే విసుగు రాలేదు. పైగా సినిమా సినిమాకీ వాటిపై ప్రేమపెరిగింది’’ అంటూ ఈ రంగంపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు కృష్ణ. ఆయన నటించిన వాటిలో దాదాపు 100 చిత్రాలు వందరోజులు జరుపుకున్నాయి. అదో రికార్డు.‌


* తొలి రికార్డులన్నీ ఆయనవే..
తొలి సాంఘిక వర్ణ‌చిత్రం ‘తేనె మన‌సులు’. తొలి కౌబోయ్‌ చిత్రం ‘మొస‌గా‌ళ్ళకు మొస‌గాడు’.‌ తొలి స్కోపు చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అప‌రాధ పరి‌శో‌ధక చిత్రం ‘గూడ‌చారి 116’. తొలి 70 ఎం.‌ఎం చిత్రం ‘సింహా‌సనం’ ఇలా తెలుగు చిత్రసీమ సగ‌ర్వంగా చెప్పు‌కొనే మైలు‌రా‌ళ్లన్నీ కృష్ణ చలవే.‌ కృష్ణలో అంద‌రికీ కని‌పించే విషయం ఆయన మంచితనం.‌ నిరా‌డ‌ంబ‌రంగా కని‌పించే విధానం.‌ కల్ల‌బొల్లి మాటలు తెలీవు.‌ మాయా మర్మం చేత‌కా‌లేదు.‌ మన‌సులో ఏది అను‌కొంటే అది బయ‌టకు చెప్పే‌య‌డమే తన స్టామినా తనకు తెలుసు.‌ తన లోపాలూ ఎరు‌గుదు.‌ దర్శకుడు చెప్పిన కథ నచ్చ‌క‌పోతే బాలేదు.‌ ఈ సినిమా పోతుంది.‌ అని చెప్పేసే తెగువ, మన సినిమా వసూళ్లు బాలే వట‌గదా.‌.‌.‌ డబ్బాలు రేపే తిరి‌గొ‌చ్చే‌స్తా‌యట కదా.‌.‌ అని చెప్ప‌గ‌లిగే ధైర్యం ఎవ‌రి‌కుంది.‌ సినిమా ఫ్లాప్‌ అని తెలిస్తే నిర్మాత ఆర్ధి‌కంగా బాగా నష్ట‌పో‌యా‌డని తెలిస్తే.. తన పారితోషికాన్ని సైతం వెనక్కిచ్చేసిన సందర్భాలు కోకొల్లలు. అందుకే ఆయన నిర్మాత హీరో అయ్యారు.‌ ఎన్టీ‌ఆర్, ఏయన్నార్, శోభ‌న్‌బాబు కృష్ణ‌రాజు వీళ్లం‌ద‌రి‌తోనూ కలిసి సిని‌మాలు చేశారు.‌ అత్య‌ధిక మల్టీ‌స్టా‌రర్‌ చిత్రాల్లో నటిం‌చిన నటు‌డె‌వ‌రంటే కృష్ణ పేరు చెప్పా‌ల్సిందే. ‘‘మరో కథా‌నా‌య‌కు‌డితో నటిం‌చ‌డంలో నాకె‌లాంటి అభ్యం‌త‌రాలు ఉండేవి కావు.‌ అప్పట్లో మా మధ్య మంచి వాతా‌వ‌రణం ఉండేది.‌ కథలూ అలాం‌టివి వచ్చేవి.‌ అందుకే, మల్టీ‌స్టా‌రర్‌ చిత్రాల సంఖ్య అప్పట్లో ఎక్కు‌వగా ఉండేది’’‌ అంటుం‌టారు‌ కృష్ణ. సాధిం‌చిన దానితో తృప్తి పడడం, ఆ విజ‌యా‌లను భావి తరా‌లకు కాను‌కలుగా అందిం‌చడం గొప్ప‌వాళ్ళ లక్షణం. కృష్ణ కూడా అంతే.‌ ఆయన నట ప్రయాణం సాఫీగా సాగి‌పో‌యింది.‌ ఎత్తు‌ప‌ల్లా‌లున్నా పరా‌జ‌యాలు బాధిం‌చినా విమ‌ర్శలు ఎదు‌ర్కొ‌వ‌లసి వచ్చినా అలు‌పె‌రు‌గని బాట‌సా‌రిగా ప్రయాణం సాగిం‌చారు.‌ చివ‌రకి విజ‌య‌తీ‌రా‌లకు చేరారు.‌ ఇప్పుడు సిని‌మా‌లకు దూరంగా విశ్రాంతి జీవితం గడు‌పు‌తు‌న్నారు.‌ మరో‌వైపు తన‌యుడు మహేష్‌ బాబు సాధి‌స్తున్న విజ‌యాల్ని చూసి ఆయన తండ్రి హృదయం గర్వి‌స్తోంది.‌ ఇప్ప‌టికీ ఆయ‌నలో నటిం‌చా‌లన్న కోరిక మంచి పాత్ర వస్తే తన‌దైన శైలి చూపిం‌చా‌లన్న తపన ఉన్నాయి.‌ అందుకే.‌.‌ ‘‘నాకు సరిపడే పాత్రలు వస్తే నటించాలని ఉంది’’ అంటూ తన మన‌సులోని మాట బయ‌ట‌పె‌ట్టారు కృష్ణ.‌ బుర్రి‌పాలెం బుల్లోడు, ఈ రికా‌ర్డుల మొన‌గాడు భావి‌త‌రా‌లకు ఇలానే స్పూర్తిని ప్రసా‌దిస్తూ ఉండా‌లని మనమూ ఆశిద్దాం..Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.