పాడు పిల్లోడు గుర్తొస్తున్నాడు

హీరోగా రాణించొచ్చు. హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవొచ్చు. హీరోలు హీరోయిన్‌గా మారి అలరించొచ్చు. హీరోయిన్లు హీరోలుగా ఆకట్టుకోవొచ్చు. కానీ ఆడ, మగ కాని పాత్రలో.. కొంచెం తేడా తేడాగా నటించాలంటే మాత్రం గట్స్‌ కావాలి. ‘ఆ ముద్ర మనపైన పడిపోతేందేమో’ అన్న భయాన్ని పోగొట్టుకుని మరీ నటించాలి. అలా నటించి.. ‘మాడా’గా నిలిచిపోయిన నటుడు ‘మాడా’ వెంకటేశ్వరరావు. ‘మాయిదారి మల్లిగాడు’, ‘ముత్యాలముగ్గు’, ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘లంబాడోళ్ల రాందాసు’, ‘మెరుపుదాడి’, ‘ఆస్తులు అంతస్తులు’ ఇలా... విజయవంతమైన చిత్రాల్లో, వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఎక్కువ శాతం ‘మాడా’ పాత్రల్లోనే కనిపించారు.1950 అక్టోబరు 10న తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించిన వెంకటేశ్వరరావు, తొలుత విద్యుత్‌ శాఖ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తరవాత సినిమాలపై ప్రేమతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ‘చూడు పిన్నమ్మా.. పాడు పిల్లోడు’ పాటలో ఆయన నటన అందరికీ నచ్చింది. ఆ తరవాత ఆ తరహా పాత్రలకు ఆయన చిరునామాగా నిలిచారు. 2015 అక్టోబరు 24న అనారోగ్య కారణాలతో మరణించారు. అయితే ఇప్పటికీ నపుంసక పాత్ర అనగానే... మాడానే గుర్తొస్తారు. ఆ తరహా పాత్రలకు ఓ డిక్షనరీగా మిగిలిపోతారు.

                                 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.