బహుముఖ ప్రతిభ

రచయితగా, దర్శకుడిగా, నటుడిగా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితం మణివన్నన్‌. అనువాద చిత్రాలతోనే ఎక్కువగా తెలుగు తెరపై మెరిసినప్పటికీ ఆయన ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా దగ్గర మాటల రచయితగా తన సినీ ప్రయాణాన్ని ఆరంభించిన మణివన్నన్‌ ఆ తర్వాత దర్శకుడిగా మారి యాభైకి పైగా చిత్రాల్ని తెరకెక్కించారు. ఆ తర్వాత ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా 400 చిత్రాల్లో మెరిశారు. తెలుగులో విజయవంతమైన ‘సీతాకోక చిలుక’కి రచయిత అయిన మణివన్నన్‌ ఆ తర్వాత ‘గోపాలరావు గారి అబ్బాయి’, ‘అగ్రిమెంట్‌’, ‘దర్జా దొంగ’, ‘ఖూనీ’ తదితర చిత్రాల్ని తెలుగులో తెరకెక్కించారు. కోయంబత్తూరు జిల్లా సూలూర్‌ అనే గ్రామంలో జన్మించిన ఆయన గుండెపోటుతో 2013 జూన్‌ 15న తుదిశ్వాస విడిచారు. ఆయన దర్శకత్వం వహించిన పొలిటకల్‌ సెటైర్‌ చిత్రం ‘నాగరాజ చోలన్‌ ఎమ్‌.ఎ, ఎమ్‌.ఎల్‌.ఎ’ ప్రేక్షకుల ముందుకొచ్చాక మణివన్నన్‌ కన్నుమూశారు. ఆయన తనయుడు రఘువన్నన్‌ ప్రస్తుతం ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. ఈరోజు మణివన్నన్‌ వర్ధంతి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.