అలనాటి మేటి దర్శకనిర్మాత

తెలుగు సినీపరిశ్రమలో తొలితరం దర్శక నిర్మాతల్లో గొప్ప కీర్తిప్రతిష్ఠలు పొందిన వారిలో ఒకరు పి.పుల్లయ్య. 2 మే 1911లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన పి.పుల్లయ్య అసలు పేరు పొలుదాసు పుల్లయ్య. చిత్ర సీమలో ఈయన్ను పీపులయ్య అని కూడా సంబోధించే వారు. దీనికి కారణం ఆయనలోని సేవా గుణమే. వీరి సతీమణి ప్రముఖ తెలుగు నటి పి.శాంతకుమారి. పి.పుల్లయ్య పద్మశ్రీ పిక్చర్స్‌ పతాకం స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శక నిర్మాతగా పనిచేశారు. వీరి దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో ‘కొడుకు కోడలు’, ‘ప్రాణ మిత్రులు’, ‘ప్రేమించి చూడు’, ‘కన్యాశుల్కం’, ‘అర్ధాంగి’, ‘ధర్మపత్ని’, ‘హరిశ్చంద్ర’ మొదలైన చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. మే 29, 1987లో కన్నుమూశారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.