అదిరిపోయే గెటప్‌తో వచ్చిన ఈ హీరో ఎవరు?
యన నటనకు వయసుతో సంబంధం లేదు.. ఆయన వేసే వైవిధ్యమైన పాత్రలకు ఇమేజ్‌ చట్రం అడ్డురాదు. ఓ చిత్రంలో 102 ఏళ్ల వృద్ధుడిగా దర్శనమిస్తే.. మరో చిత్రంలో మానసికంగా ఎదగని కుర్రాడిగా కనిపించి మురిపిస్తాడు. ఓసారి బందిపోటు దొంగగా భయపెడితే.. మరోసారి లాయర్‌గా మారి కోర్టు హాల్‌లో తనదైన వాదనలతో మెప్పిస్తాడు. ఇప్పుడీ సీనియర్‌ హీరో ఓ కోపిష్ఠి ఇంటి యజమాని పాత్రతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న లుక్‌ ఆ సినిమాకు సంబంధించినదే. తనకు ఓ పాత్ర నచ్చితే అందులోకి ఎంతలా ఒదిగిపోతాడో చెప్పేందుకు ఈ లుక్‌ ఓ నిదర్శనమని చెప్పొచ్చు. 76 ఏళ్ల వయసులో ఓ పాత్ర కోసం ఇంతలా శ్రమించి, గంటల కొద్దీ ఓపికగా కుర్చీలో కూర్చొని ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేయించుకోవడమంటే అదొక సాహసమే అని చెప్పాలి. ఈ వయసులోనూ ఆయన ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు కాబట్టే భారతీయ సినీచరిత్రలో ఆయన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇంతకీ ఈ బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయకుడు ఎవరో గుర్తించారా?

క్లూ:
బాలీవుడ్‌ దర్శకుడు శూజిత్‌ సర్కార్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్నాడు. 2020 ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.