ఈ ఫొటోలోని ముగ్గురు హీరోల్ని గుర్తుపట్టారా?

ఈ ఫొటో చూడగానే మీ పాఠశాల రోజులు గుర్తుకొస్తున్నాయి కదూ! ఎత్తుగా ఉన్న వాళ్లు వెనక స్థానంలో, మిగిలిన వాళ్లు ముందు స్థానంలో నిల్చొండిరా అంటూ ఉపాధ్యాయులు చెప్పిన మాట ఆ సమయంలో భలే ఉంటుంది. మనకు చోటు లేకపోతే పక్కనే ఉన్న మిత్రుడ్ని కొంచెం జరుగు అనడం, ఫొటో గ్రాఫర్‌ స్టిల్‌ అనగానే చిరు నవ్వులు చిందించడం ఎప్పటికీ మర్చిపోలేం. ఇక్కడున్న వారంతా ఒకప్పటి పదో తరగతి విద్యార్థులు. వీడ్కోలు కార్యక్రమంలో ఇలా దర్శనమిచ్చారు. వీళ్లలో ముగ్గురు కథానాయకులుగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర నటులుగా రాణిస్తున్నారు. వాళ్లెవరో గుర్తు పట్టగలరా?


క్లూ: ఉపాధ్యాయుల వెనక ఉన్న వరసలో ఇద్దరూ చేతులు ఒకే విధంగా పట్టుకున్నారు. మరో వ్యక్తి చివరి వరసలో కాస్త బొద్దుగా ఉన్నాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.