ఈ కలువ కన్నుల చిన్నదాని పేరేంటో?
కలువ పువ్వుల్లాంటి కళ్లు.. బూరెల్లాంటి బుగ్గలు. చక్కనైన చిన్న గౌనులో ముద్దులొలుకుతున్న ఆ చిన్నదాన్ని చూస్తుంటే ఎంత ముద్దొస్తుందో కదా. ఎంచక్కా వాళ్లమ్మ చంకనెక్కి కెమేరాకు ఎంత చక్కగా స్టిల్‌ ఇచ్చిందో చూడండి. బాలనటిగా వెండితెరపైకి మెరుపులు మెరిపించిన ఈ చిన్నది.. ఇప్పుడు దక్షిణాదిలో మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయిక. పట్టుమని పాతిక చిత్రాలైనా చేయకుండానే అలనాటి అగ్రతారకలకు దక్కినంత గౌరవాని దక్కించుకొంది. ఆకట్టుకునే అందం.. అదరగొట్టే అభినయాలతో వెండితెరపై బంగారు కొండలా వెలుగులీనుతోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పేరేంటో చెప్పుకోండి చూద్దాం!!Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.