ఈ చిచ్చర పిడుగులెవరో చెప్పగలరా?
ఇక్కడ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్న ఈ ఇద్దరు పిల్లలు అన్నదమ్ములు. ప్రస్తుతం ఒకరు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా వరుస సినిమాలతో దూసుకెళ్తుండగా.. మరొకరు ఇప్పుడిప్పుడే చిత్రసీమలో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వారసత్వ అండతోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. ఈ చిచ్చర పిడుగులిద్దరూ సొంత ప్రతిభతోనే వెండితెరపై సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలోని పెద్దబాబుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. మలయాళ, తమిళ చిత్రసీమల్లోనూ మంచి ఆదరణ ఉంది. ఇక అతని హిందీ డబ్బింగ్‌ చిత్రాలకు యూట్యూబ్‌లో విశేషమైన ఆదరణ దక్కుతుంటుంది. ఇంతకీ ఈ యువ కథానాయకులిద్దరూ ఎవరో చెప్పుకోండి చూద్దాం.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.