ఎర్ర గౌనులో ఉన్న ఈ బుజ్జిపాప ఎవరు?
ర్రటి గౌనులో.. పొడవాటి జడ వేసుకోని, అమ్మతో కలిసి చూడముచ్చటగా ఫొటోకు ఫోజిచ్చిన ఈ బుజ్జిది ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయిక. త్వరలోనే ఓ భారీ ప్రతిష్ఠాత్మక చిత్రంతో తెలుగు, తమిళ చిత్రసీమల్లోనూ జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. కెరీర్‌ తొలినాళ్లలో గ్లామర్‌ పాత్రలతో అలరించిన ఈ భామ.. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటోంది. అందం, అభినయమే కాకుండా అదిరిపోయే డ్యాన్సులతోనూ సినీప్రియులను ఉర్రూతలూగిస్తుంటుంది. ఇంతకీ ఈ భామ పేరేంటో చెప్పుకోండి.

క్లూ: ఈ స్త్రీ మంచి స్ట్రీట్‌ డ్యాన్సర్‌ కూడా..
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.