గోరు ముద్దలు తింటోన్న ఈ బ్యూటీ క్వీన్‌ ఎవరు?
ఇక్కడ అమ్మ చేతితో గోరు ముద్దలు తింటున్నట్లుగా కనిపిస్తోన్న ఈ బుజ్జి పాపాయి.. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ కథానాయిక. మోడలింగ్‌ ప్రపంచంలో సత్తా చాటాలనే లక్ష్యంతో ర్యాంప్‌పై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. వెండితెరపైకి వచ్చి వాలి సినీప్రియుల మదిలో కలల రాణిగా మారిపోయింది. తొలి అడుగులోనే షారుఖ్‌ ఖాన్‌ వంటి అగ్ర కథానాయకుడి సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోని అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ, తన తొలి చిత్రం తర్వాత మరో అవకాశాన్ని దక్కించుకోవడానికి రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చినా.. అక్కడి నుంచి వరుస అవకాశాలతో బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయికగా మారిపోయింది. తొలినాళ్లలో ఎక్కువగా గ్లామర్‌ పాత్రలతోనే మెప్పించిన ఈ భామ.. ప్రస్తుతం నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. కేవలం నటిగానే కాక, నిర్మాతగానూ చిత్రసీమలో దూసుకెళ్తోంది. 2017లో తన మనసుకు నచ్చిన ప్రియ సఖుడితో ఏడడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఈ స్టార్‌ నాయిక పేరేంటో చెప్పుకోండి చూద్దాం.
క్లూ: ఈ మద్దుగుమ్మ తండ్రి భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేశారు. ఈమె కార్మిక దినోత్సవం నాడు జన్మించి.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.