ఎవరీ స్టార్‌ హీరో.. ఏమిటీ చిత్రం?
‘‘ఓ కొత్త రోజున.. ఓ వైవిధ్యమైన పాత్ర కోసం.. పూర్తి కొత్త లుక్‌తో.. ఏడాది తర్వాత కెమెరా ముందు నుంచున్నా’’ అంటున్నాడు ఇక్కడ కనిపిస్తున్న యువ హీరో. అదేంటి కొత్త లుక్‌ అన్నాడు కదా.. మరి ముఖం చూపించట్లేది అనుకోకండి. ఇప్పుడే కదా ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లింది.. త్వరలోనే తన లుక్‌తో సర్‌ప్రైజ్‌ చేస్తాడు లేండి. ఇంతకీ ఈ యువ హీరో ఎవరో ఏమైనా అర్థమైందా? తెలియకపోతే ఈ ఫొటోలోనే మరొక క్లూ ఉంది చూడండి. ఇక్కడ హీరో ముందు బ్లాక్‌ టోపీ పెట్టుకోని, మెడలో కర్చీఫ్‌ కట్టుకోని హడావుడిగా ఓ వ్యక్తి తిరుగుతున్నాడు చూశారా. ఆయనే ఈ సినిమాకు దర్శకుడు. పేరు వెంకీ కుడుముల. ‘ఛలో’ వంటి హిట్‌ తర్వాత ఆయన నుంచి రాబోతున్న రెండో చిత్రమిది. ఏడాదిగా వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెట్స్‌పైకి వెళ్లింది. మరి ఈ సినిమా పేరేంటి? ఇక్కడ కనిపిస్తున్న హీరో ఎవరు? చెప్పుకోండి చూద్దాం.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.