చీరకట్టులో మురిపిస్తోన్న ఈ చిన్నారి ఎవరు?
పెద్దయ్యాక స్టార్‌ నాయికను అవుతానని చిన్నప్పుడే గుర్తించేసిందో ఏమో.. అమ్మ చీర కట్టుకొని క్యాట్‌వాక్‌ చేయడం ఆరోజుల్లోనే షురూ చేసేసింది ఈ చిన్నది. చిన్ని చిన్ని పిలకలు.. బూరెల్లాంటి బుగ్గలతో ఆ గళ్ల చీరలో ఆ బుజ్జి పాపను చూస్తుంటే ఎంత ముద్దుగా ఉందో కదా. ప్రస్తుతం ఈ బుజ్జి దక్షిణాదిలోనే మోస్ట్‌వాంటెడ్‌ కథానాయిక. అందం, అభినయంతోనే కాదు అద్భుతమైన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌తోనూ థియేటర్లో సినీప్రియుల్ని కట్టిపడేస్తుంటుంది. అందుకే ఇప్పుడు దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న కథానాయికల్లో ఒకరిగా వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ఇంతకీ ఈ కథానాయిక ఎవరో చెప్పుకోండి చూద్దాం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.