ఈ అభిమాన తారక ఎవరు?
సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక సినీతారల జీవితాలు వారి అభిమానుల మరింత చేరువయ్యాయి. తమ జీవితాల్లోని ప్రతి ఆనంద క్షణాన్ని ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటూ.. తమ సంతోషాల్లో వారిని కూడా భాగస్వామ్యులను చేస్తున్నారు. ఇక ఈ సోషల్‌ వాల్‌పై కథానాయికలు చేసే సందడి మరింత ప్రత్యేకం. ఎప్పటికప్పుడు వేడి వేడిగా కిర్రాకు పుట్టించే ఫొటోలను షేర్‌ చేస్తూ తమ అభిమానుల మదిని గిలిగింతలు పెడుతుంటారు. అయితే తాజాగా ఓ అభిమాని తన అభిమాన నటికి సోషల్‌మీడియా వేదికగా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ కింద కనిపిస్తున్న ఫొటో దానికి సంబంధించినదే. ఇక్కడ అమ్మ భుజాలపై చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోన్న ఈ చిన్నది.. ప్రస్తుతం దక్షిణాదిలోనే మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయిక. గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఓ అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస హిట్లతో తెలుగింటి ఆడపడుచులా మారిపోయింది. కెరీర్‌ తొలినాళ్లలో గ్లామర్‌ పాత్రలతోనే ఎక్కువగా సందడి చేసిన ఈ భామ.. ఇటీవల కాలంలో నటనా ప్రాధాన్యమున్న సినిమాలతో అదరగొట్టడం షురూ చేసింది. తాజాగా మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకోని బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సర్‌ప్రైజ్‌ ఫొటో చూసిన సదరు కథానాయిక తన అభిమాని తనపై చూపిన అభిమానానికి సంతోషం వ్యక్తం చేసింది. ఆమె పంపిన ఆ ఫొటోలను తన ట్విటర్‌లో రీ షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఇంతకీ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నదాని పేరేంటో చెప్పుకోండి చూద్దాం..

క్లూ: ఈ కథానాయిక తన తొలి చిత్రంలో ఏ హీరోతో అయితే జోడీ కట్టిందో.. అతన్నే నిజ జీవితంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ భామ ముద్దు పేరు మంగమ్మ.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.