రజనీకాంత్‌కి బేడీలు వేసిన హేమామాలిని!
క్కడ రజనీకాంత్‌ చేతికి బేడీలు వేసి తీసుకెళ్తోంది పోలీస్‌ అధికారి దుర్గా దేవి సింగ్‌ (హేమమాలిని). ఇంతకీ రజనీకాంత్‌ చేతికి హేమ సంకెళ్లు ఎందుకు వేసింది. ఈ స్టిల్‌ గురించి తెలియాలంటే అలనాటి తెలుగు దర్శకుడు తాతినేని రామారావు 1983లో తీసిన హిందీ చిత్రాన్ని చూడాల్సిందే. అన్నట్టు ఆ బాలీవుడ్‌ సినిమా పేరేమిటో తెలుసా? మీకు ఇక్కడ ఓ క్లూ కూడా ఇస్తున్నాం. రజనీకాంత్‌ - హేమమాలినితో పాటు ఈ చిత్రంలో మరో తెలుగు నటి మాధవి కూడా ఇందులో నటించింది. ఇంతకీ ఆ సినిమా పేరేమిటో ఇప్పటికైనా తెలిసిందా?Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.