టామ్‌ బాయ్‌లా కనిపిస్తున్న ఈ స్టార్‌ నాయిక ఎవరో?
టామ్‌ బాయ్‌లా చక్కగా బ్లూ స్వెట్టర్‌ వేసుకోని తన తండ్రితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకి ఫోజిచ్చిన ఈ చిన్నది.. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి పేరున్న కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని అగ్ర కథానాయకులందరితోనూ ఆడిపాడింది. బెంగుళూరులో పుట్టిపెరిగిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘పోకిరీ’ కన్నడ రీమేక్‌ (పోర్కి)తో తొలిసారి వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత యువ హీరో సిద్దార్థ్‌ కథానాయకుడిగా నటించిన ఓ సినిమాతో టాలీవుడ్‌లోనూ మెరిసి సత్తా చాటింది. ఈ ఏడాది ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో కృష్ణకుమారిగా కనిపించి మురిపించింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.