టాక్స్‌తో సందేశమిస్తోన్న ఈ భామ ఎవరు?
‘ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతుంటారు’ అంటారు పెద్దలు. ఇక్కడ కనిపిస్తున్న ముద్దుగుమ్మకు కూడా చిత్రసీమలో అలాంటి అనుభవమే ఎదురైనట్లు కనిపిస్తోంది. ఆమె మాటల్లో, రాతల్లో ఏవో తెలియని ఓ లోతైన భావాలు.. కవితాత్మక వ్యక్తీకరణలు ఇటీవల తరచుగా దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ భామ ఓ హాట్‌ హాట్‌ ఫొటోను షేర్‌ చేస్తూ దానికొక ఆసక్తికరమైన సందేశాన్ని జోడించింది. ‘‘మీ విలువ మీరు తెలుసుకోండి.. దానికి టాక్స్‌ను కలుపుకోండి’’ అన్నది ఆ సందేశ సారాంశం. ‘విలువ తెలుసుకోవడం వరకు సరే.. ఆ టాక్స్‌ అన్నది ఏంటి చెప్మా’ అంటూ ఈ ఫొటోను చూసిన నెటిజన్లంతా తలలు పట్టుకుంటున్నారు. సర్లే ఆ భామ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్య పెట్టిందో మీకెందుకు గానీ, మీరైతే ఆ సందేశాన్ని పక్కకు నెట్టి ఇక్కడున్న ఆమె అందాన్ని ఆస్వాదించేయండి. మెరున్‌ కలర్‌ గౌనులో కళ్ల నిండా ఓ తియ్యని మత్తు నింపుకొని, పరువాలను వయ్యారంగా ఆరోబోస్తున్నట్లుగా కూర్చొని ఉన్న ఆమెను చూస్తుంటే మతులు పోతున్నాయి కదా. క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కించిన ఓ క్రేజీ మూవీతో తెలుగువారికి దగ్గరయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎందుకో ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. అందం.. అభినయం.. ఆరంభంలోనే అదిరిపోయే విజయం.. ఇలా అన్నీ ఉన్నా అవకాశాలు మాత్రం ముఖం చాటేశాయి. దీంతో ఇటీవల కాలంలో పూర్తిగా సోషల్‌ మీడియా ద్వారానే తన సొగసుల విందు వడ్డించే ప్రొగ్రాంకు తెరలేపింది. అయితే తాజాగా ఈ భామ చిరంజీవితో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’లో నటించే లక్కీ అవకాశాన్ని కొట్టేసింది. ఇందులో ఆమె పాత్ర చిన్నదే అయినా.. దానిపైనే నమ్మకాలన్నీ పెట్టుకుంది ఈ అందాల చిన్నది. ఇంతకీ ఈ భామ ఎవరో గుర్తించారా?

                                           క్లూ: ఆమె తన ప్రియుడిని ‘హేయ్‌ షేక్స్‌పియర్‌’ అని పిలుస్తుంటుంది.
 
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.