పక్కింటి పిల్లలా ఉన్న ఈ స్టార్‌ నాయిక ఎవరు?
చక్కనైన పక్కింటి పిల్లలా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయిక. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఆమె స్కూల్‌కు వెల రోజుల్లో తీసుకున్నదట. బోల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ అన్న పదానికి నిలువెత్తు చిరునామా తను. ఇక హాట్‌హాట్‌ ఫొటో షూట్లతో నెట్టింట ఈ భామ చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వెండితెరను మించిన కనుల విందును అందిస్తుంటాయి ఆమె సామాజిక మాధ్యమాల ఖాతాలు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ఈ ముద్దుల కథానాయిక ఎవరో చెప్పుకోండి చూద్దాం.
 Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.