వేదాంతం వల్లిస్తున్న.. ఈ తేనెకళ్ల సుందరి ఎవరు?

ప్రే
మలో విఫలమైన వారంటే ఎలా ఉంటారు. పాతతరం చిత్రాలు చూసిన వారికైతే ‘దేవదాస్‌’లోని ఏయన్నార్‌ లుక్‌ గుర్తొస్తుంది. నేటి తరానికైతే ‘అర్జున్‌ రెడ్డి’లోని విజయ్‌ దేవరకొండ రూపం కళ్లలో మెదులుతుంది. నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వారు ఉన్నట్లుండి మన నుంచి దూరమైతే ఇంతలా పిచ్చివారైపోతారా? ఆ మనోవేదనలో పడి జీవితాల్ని ఇంత దారుణంగా నాశనం చేసుకుంటారా? అని ఎవరికైనా అనిపించక మానదు. ఓ క్షణంలో వారి జీవితాల్ని చూస్తే.. హృదయాలు బాధతో బరువెక్కుతాయి కూడా. అదే మరి ఎవరైనా ప్రేమించిన వాళ్లకు దూరమయ్యాకే చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్తే మీకెలా అనిపిస్తుంది. అదేంటి.. ఇలా ఫీలయ్యే వాళ్లు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ప్రస్తుతం కింద ఫొటోలో మసకగా కనిపిస్తున్న ఈ తేనె కళ్ల సుందరికి నిజంగా అలాగే ఉందట. ‘‘అందరూ నన్ను బ్రేకప్‌ తర్వాత ఎలా ఉన్నావు అని తరచూ ప్రశ్నిస్తున్నారు. నేను నా జీవితంలో అత్యంత సంతోషకరమైన దశలో ఉన్నాను. గతంలో ఎప్పుడూ కూడా ఇంతటి ఆనందాన్ని అనుభవించలేదు. మైఖేల్‌ నుంచి దూరమవ్వాలని అనుకోవడం.. నేను నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. నేనెప్పుడూ నా సంతోషానికే తొలి ప్రాధాన్యమిస్తా. అది ఒక పెర్ఫ్యూమ్‌ను ఎంపిక చేసుకున్నట్లుగా ఉంటుంది. దాని వాసనను మనం ఎక్కువగా పీల్చేశాక.. కాస్త దానికి విరామమివ్వక పోతే ఆ వాసన ఎలా ఉందో చెప్పలేం. అలాగే జీవితం కూడా దానంతట అది సాగిపోతుంటుంది. కాబట్టి మనం కొంత బ్రేక్‌ ఇచ్చి ముందుకెళ్లాలి. అలా ఆగి ఊపిరి తీసుకోకుంటే.. తర్వాత ఏం చేయాలి, ఎటు వెళ్లాలి, ఎలా వెళ్లాలి? అన్నది సరిగా తేల్చుకోలేం’’ అని వేదాంతం వల్లించింది. ఇక ఇదంతా సరేకానీ.. ఇక్కడున్న ఈ కథానాయిక ఎవరో గుర్తుపట్టారా? చిన్న క్లూ ఇవ్వమంటారా. ఆమె ఓ తమిళ స్టార్‌ హీరో కుమార్తె. తండ్రిలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు, తమిళ చిత్రసీమల్లో అగ్రనాయికగా వెలుగులు విరజిమ్మింది. మంచి గాయని కూడా. కొంతకాలంగా సినిమాలకు విరామమిచ్చన ఈ భామ త్వరలో ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. మరి ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.
 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.