పదిలోనే ప్రేమలో పడిన ఈ నాయిక ఎవరు?
ప్రతిఒక్కరి జీవితంలో కచ్చితంగా ఒక్క ప్రేమకథైనా ఉండి తీరుతుంది. ఆ కథలు కంచికి చేరినా.. చేరకున్నా వారి మదిలో అవెప్పుడూ తీయని జ్ఞాపకాలుగా పదిలంగానే ఉంటాయి. ఇక ఈ ప్రేమ వ్యవహారాల్లో సినీతారల ప్రేమపురాణాలు మరింత ప్రత్యేకం. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న ముద్దుగుమ్మకు కూడా ఓ అందమైన ప్రేమకథ ఉందట. ఆమె జీవితంలో ఒక్కసారే ప్రేమలో పడ్డానని, అది కూడా పదో తరగతిలో ఉన్నప్పుడు జరిగిందని ఓ ఆంగ్లమీడియాతో పాత జ్ఞాపకాలను పంచుకుంది. ‘‘చిన్నప్పటి నుంచీ మేమిద్దరం కలిసే పెరిగాం. కాబట్టి మా మధ్య ప్రేమ చాలా విభిన్నంగా ఉండేది. పదో తరగతిలో ఉన్నప్పుడు మా ఇద్దరి ప్రేమను ఒకరికొకరం చెప్పుకున్నాం. ఓసారి నేనతనితో ఫోన్‌లో మాట్లాడుతుంటే.. మా అమ్మ కనిపెట్టేసింది. ఓవైపు పరీక్షలు పెట్టుకోని ప్రేమలో పడటానికి నీకెంత ధైర్యమంటూ హెచ్చరించింది. ఇప్పటి నుంచి నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడొద్దని గట్టిగా వార్నింగ్‌ కూడా ఇచ్చింది. దాంతో అతనికి దూరమయ్యా. కానీ, ఇప్పటికీ అతడు నాకు మంచి స్నేహితుడే. నేను బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా తొలి ఫోన్‌ అతనకే చేస్తాను’’ అని తన ప్రేమాయణాన్ని బయటపెట్టింది. భలేగా ఉంది కదా ఆమె ప్రేమగాథ.. ఇంతకీ ఈ అందాల సుందరి ఎవరో గుర్తుపట్టారా మరి?

క్లూ: ‘లస్ట్‌స్టోరీస్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించిన ఈ భామ.. ప్రస్తుతం ప్రీతి అనే పాత్రతో మరోసారి అందరి హృదయాలను కొల్లగొడుతోంది. తెలుగులో మహేష్‌తో తొలి చిత్రం.. రామ్‌చరణ్‌తో రెండో సినిమాలో నటించింది.
 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.