వింటేజ్‌ బ్యూటీగా మారిన ఈ నాయిక ఎవరో?
కొన్నేళ్ల క్రితం వరకు ఓ సినీ హీరోను చూడాలన్నా.. ఓ స్టార్‌ కథానాయికను దర్శించుకోవాలన్నా.. వాళ్ల వాళ్ల కొత్త సినిమాలు వస్తేనో, లేక, ఏదైనా సినీ మ్యాగజైన్‌లో వస్తేనో తప్ప కుదిరేది కాదు. కానీ, ఇప్పుడు సామాజిక మాధ్యమాల పుణ్యమాని తమ అభిమాన సినీతారలను ఎప్పటికప్పుడు చూసుకునే వీలు కలుగుతోంది. ముఖ్యంగా కథానాయికలు ఈ మాధ్యమాలకు తమదైన చక్కనైన సొగసులతో కొత్త సొబగులు అద్దుతున్నారు. హాట్‌ హాట్‌ ఫొటో షూట్లతో నెటిజన్ల మదిలో కాక రేపుతున్నారు. సోషల్‌ వాల్‌పై తమ ఒంపు సొంపులను వయ్యారంగా ఒలికిస్తూ కుర్రకారును గుండెల్లో గుబులు రేపుతున్నారు. ఇప్పుడిక్కడ కనిపిస్తున్న ఈ వయ్యారి భామ కూడా సోషల్‌మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పటికప్పుడు అందాల విందును కొసరి కొసరి వడ్డిస్తూనే ఉంటుంది. చిత్రసీమలోకి వచ్చి కాలం దాటిపోయినా నాటికీ నేటికీ అదే అందచందాలతో హొయలు పోతోంది. తాజాగా ఈ భామ పోస్ట్‌ చేసిన ఈ ఫొటో చూశారుగా ఎంత అద్భుతంగా ఉందో. షాడోస్‌ - సిలౌట్‌ థీమ్‌తో చేసిన ఈ ఫొటో షూట్‌లో ఈ ముద్దుగుమ్మ బంగారు రంగు చీర.. ఎరుపు రంగు బ్లౌజ్‌ ధరింజి వింటేజ్‌ స్టైల్‌లో కనిపించి ఆకట్టుకుంది. ఇక ఆమె కొప్పులోని పువ్వుతో పాటు ఆమె చేతిలో మరో పెద్ద పువ్వు పట్టుకోని ఓ రొమాంటిక్‌ లుక్‌తో ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్న తీరు ఆ ఫొటోకు మరింత సొగసులు అందించినట్లుగా కనిపిస్తోంది. ఇంతకీ ఇక్కడ కనిపిస్తున్న ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా?

క్లూ: ప్యారిస్‌ను ఇష్టపడే మోడ్రన్‌ సీత ఈమె.
 
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.