సన్నజాజిలా మారిన ఈ సీతను గుర్తుపట్టారా?
‘‘ఫలితం దక్కాలంటే ఓర్పు కావాలి.. పోరాటం, శ్రమ అన్నీ ఉండాలి. మార్పు అనేది సమర్పణ.. బలం అనే రెండు అంశాల సమాహారం’’ అంటూ కొన్నాళ్ల కిత్రం రాశీఖన్నా పోస్ట్‌ చేసిన ఈ తారక మంత్రం కథ ఏంటో తెలుసా. ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉన్న రాశీని సన్నజాజి ముద్దుగుమ్మలా మార్చింది ఈ తారక మంత్రమే. తనని తాను కరిగించుకునే ప్రయత్నంలో రాశీ ప్రతిక్షణం ఈ స్ఫూర్తి మంత్రాన్నే మనసులో పెట్టుకోని శ్రమించింది. ఎంతో ఓర్పుతో నెలలకు నెలలు జిమ్‌లో కఠోరమైన కసరత్తులు చేసి తాను అనుకున్న రూపాన్ని సాధించగలిగింది. ఆ తర్వాత ఈ భామ బాటనే స్ఫూర్తిగా తీసుకోని సన్నని సొంపుల శరీరాకృతిని సాధించుకుంది నయా సావిత్రి కీర్తి సురేష్‌. అప్పట్లో ‘మహానటి’ చిత్రం కోసం ఈ భామ కూడా కాస్త ఒళ్లు పెంచాల్సి వచ్చింది. కానీ, అది పూర్తయిన వెంటనే కొన్నాళ్ల పాటు కెమెరా ముందు నుంచి కనుమరుగైపోయింది. కొన్నాళ్ల పాటు ఎంతో శ్రమించి మరి మునుపటి రూపాన్ని సాధించుకుంది. ఇప్పుడీ ఇద్దరి విజయాలను స్ఫూర్తిగా తీసుకుందో ఏమో.. ఒకప్పుడు బొద్దు గుమ్మలా తెరపై సందడి చేసిన ఈ భామ, ఇప్పుడిలా సన్నజాజి పువ్వులా మారిపోయి అందరికీ షాక్‌ ఇస్తోంది. తెలుగు నాట పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రసీమ నుంచి తన జర్నీని ప్రారంభించి వెండితెరపై సత్తా చాటింది. కెరీర్‌ తొలినాళ్లలోనే రచ్చ గెలిచిన ఈ యువ తారక ఆ తర్వాత తెలుగులో వెంకటేష్‌ సరసన ఆడిపాడింది. ఈ జోరులోనే ఓ నాయికా ప్రాధాన్య చిత్రం కోసం దెయ్యంలా మారి సినీప్రియుల్ని భయపెట్టింది. అయితే కొన్నాళ్లుగా తమిళ చిత్రసీమకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ చాన్నాళ్ల తర్వాత ఇలా సరికొత్త రూపుతో సోషల్‌ మీడియా ద్వారా దర్శనమిచ్చి అందరికీ షాక్‌ ఇచ్చింది. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ప్రేక్షకుల్ని మురిపించిన ఈ భామ.. ఇప్పుడిలా సన్నజాజి పువ్వులా కనిపించే సరికి కుర్రకారుకు మతులు పోయినంత పనైంది. ఇంతకీ ఇక్కడున్న ఈ అందాల రాశి ఎవరో గుర్తుపట్టారా?

 
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.