బికినీతో రానున్న ఈ స్టార్‌కిడ్‌ ఎవరు?
ప్రస్తుతం ఏ చిత్రసీమను పరీక్షించి చూసినా.. వారసత్వ నీడ నుంచి తెరపై వచ్చి వాలుతున్న కొత్త నాయకానాయికలే ఎక్కువగా కనిపిస్తున్నారు. వీరిపై ఉన్న తమవారి బ్రాండ్‌ ఇమేజ్‌ కొన్నిసార్లు సానుకూలంగా మరికొన్ని సార్లు ప్రతికూలంగా పనిచేస్తుంటది. అన్నీ అనుకున్నట్లు జరిగి వరుస హిట్లతో దూసుకెü™్త తల్లిదండ్రులకు తగ్గ వారసులని కీర్తి తెచ్చుకుంటారు. లేదంటే అదే రంగుల ప్రపంచంపై క్రమంగా మసకబారిపోతారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ భామ కూడా అలా తెరపై తళుక్కుమన్నదే. యావత్‌ భారతీయ చిత్రసీమలోనే ఓ గొప్ప నటికి బిడ్డగా భారీ అంచనాల మధ్య తెరంగేట్రం చేసిన ఈ అందాల చిన్నది తొలి ప్రయత్నంలోనే తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంది. అటు అందం.. ఇటు అభినయంతో తల్లికి తగ్గ తనయురాలనిపించుకుంది. ఇంతవరకు చేసింది ఒక్క చిత్రమే అయినా.. సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులకు అందాల పరిమళాలు పంచుతునే ఉంటుంది. తన ఫాలోయింగ్‌ను అంతకంతకు పెంచుకుంటూనే ఉంది. ఇక బాంద్రా వీధుల్లో చిన్ని చిన్ని నిక్కర్లతో వయ్యారాలు పోతూ చేసే ఆమె సందడిని మాటల్లో చెప్పడం అంత తేలిక కాదు. అది తనివితీరా చూసి ఆస్వాదించాల్సిందే. ఇంతకీ విషయమేంటంటే.. ఇప్పటికే కురచ దుస్తుల్లో నెట్టింట కుర్రకారును ఒక ఊపు ఊపేస్తోన్న ఈ ముద్దుగుమ్మతో త్వరలోనే బికినీ షో చూపించబోతున్నాడట నిర్మాత కరణ్‌ జోహార్‌. ఇప్పటికే ఆ విషయాన్ని ఆమెకు కూడా చెప్పగా.. తాను రెడీ అనేసిందట. అంటే త్వరలోనే ఈ అమ్మడు థియేటర్లో తన అభిమానులకు అందాల విందు వడ్డించబోతుందన మాట. ఇంతకీ బికినీ షోకి రెడీ అన్న ఈ బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ ఎవరు? ఆమె చేస్తోన్న తాజా చిత్రమేంటి?

క్లూ: ఈమె దేవేంద్రుడికి మనవరాలు అవుతుంది!!
 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.