కూల్‌..కూల్‌గా మారిన ఈ బోల్డ్‌ భామ ఎవరో?
గులాబి రంగు డ్రెస్‌లో ఆ సొగసులు చూస్తుంటే ప్రేమదేశానికి ఆమె యువరాణిలా కనిపిస్తోంది. చురకత్తుల్లా చూస్తున్న ఆ చూపులు కుర్రకారు గుండెపై సుతిమెత్తని గాయాలు చేస్తున్నాయి. అయినా ఆమె చూపులు చేసిన గాయాలు వారికి కమ్మనైన మధుర జ్ఞాపకాలే. ఇక ఆ మోముపైన పడిన ముంగురుల అందం ఏమని వర్ణించగలరు. చందమామపై ఇంద్రధనస్సు వచ్చి వాలినంత చూడముచ్చటగా ఉంది. వీటిన్నిటినీ మించి ఆ అందాల ముద్దుగుమ్మ తలపై ఉంచిన ఆ పూల కిరీటం మరింత ప్రత్యేకం. పారిజాత పుష్పం.. సన్నజాజి కిరీటం ధరించి సందడి చేస్తుందా అన్నట్లుగా ఆకట్టుకునేలా ఉంది. ఎప్పుడూ బోల్డ్‌గా అందాల విందు పంచే ఈ సొగసుల చిన్నది.. తాజాగా కూల్‌ లుక్స్‌తో నెట్టింట కుర్రకారను మత్తులోకి దింపేస్తోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?
 Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.