తప్పుగా అనుకున్నా పర్లేదు.. అంటోన్న ఈ భామ ఎవరు?

క్కడ కనిపిస్తోన్న ఈ సొగసుల చిన్నది.. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఓ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. కానీ, ఆ తర్వాత హిందీ చిత్ర సీమవైపే ఎక్కువ దృష్టిపెట్టింది. ‘ఎమ్‌ఎస్‌ ధోనీ..’, ‘బాఘీ 2’ ‘భారత్‌’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై తన అందచందాలతో ఎంత పాపులర్‌ అయిందో బాయ్‌ ఫ్రెండ్స్‌ విషయంలోనూ అంతకంటే ఎక్కువగానే సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యింది. కొన్ని రోజులు ఆదిత్య ఠాక్రేతో, తర్వాత టైగర్‌ ష్రాప్‌లతో చెట్టాపట్టాలేసుకొని రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతుందంటూ వాళ్లతో కలిసి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో బాయ్‌ ఫ్రెండ్స్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న విషయాలపై ఆమె మాట్లాడింది. ‘‘ప్రతి ఒక్కరూ స్నేహితులతో కలిసి లంచ్, డిన్నర్‌లకు వెళ్తుంటారు. అందులో తప్పేముంది? స్నేహితుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ ఉంటారు. జెండర్‌ ఆధారంగా స్నేహితుల్ని ఎంచుకొనే అలవాటు నాకు లేదు. కేవలం అమ్మాయిలతో స్నేహం చేయాలని అనుకోవడం లేదు’’ అని చెప్పింది. చిత్రసీమ అంటేనే నిరంతర అందరి దృష్టీ ఉండే రంగమని తెలిసే ఇక్కడికి వచ్చానంటోంది దిశ. ‘‘సినిమా అనేది గ్లామర్‌ ప్రపంచం. ఇందులో నాయికలపై ఎక్కువగా అందరి దృష్టి ఉంటుందని నాకు తెలుసు. కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా నేను పట్టించుకోను. కేవలం నా పని మీదే దృష్టిపెడతాను’’ అని చెప్పింది. ఈమె ప్రస్తుతం థ్రిల్లర్‌ చిత్రాల దర్శకుడు మోహిత్‌ సూరి తెరకెక్కిస్తోన్న ‘మలంగ్‌’లో నటిస్తోంది.
ఇంతకీ ఈ హాట్‌ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?
 
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.