తానింకా ఎల్‌కేజీనే అంటోన్న ఈ తార ఎవరు?
ప్రతిఒక్కరూ ఓ వృత్తిలో అడుగుపెట్టాక తమ నైపుణ్యానికి ఎన్నోకొన్ని మార్కులు ఇచ్చుకోమంటే.. మరీ వందకు వంద అని చెప్పకపోయినా కనీసం పదికి తక్కువ కాకుండా మార్కులు ఇచ్చుకుంటారు. ఇంతవరకు ఈ వృత్తిలో ఏం నేర్చుకున్నారు అని అడిగితే తమకు తెలిసినంత వరకైనా కచ్చితంగా వివరించి చూపిస్తారు. కానీ, ఇక్కడున్న ముద్దుగుమ్మ మాత్రం నాకెప్పుడూ సున్నా మార్కులే వేసుకుంటా, ఇప్పటికీ నాకేం తెలియదు అనే అనుకుంటా అని చెప్పుకుంటోంది. అదేంటి.. ఎందుకీ సుందరికి ఇంతటి నిర్లక్ష్య ధోరణి అని తప్పుగా అనుకోకండి. ఇలా తనకు తాను తక్కువ రేటింగ్‌ ఇచ్చుకోవడం వల్ల మరింత ఎక్కువ తెలుసుకునే అవకాశముంటుందట. ‘‘నాకెప్పుడూ నేను సున్నా మార్కులే వేసుకుంటా. సెట్లోకి వెళ్లినా.. ఏ కొత్త వ్యక్తితోనో మాట్లాడుతున్నా.. ‘నాకేం తెలియదు’ అనే అనుకుంటా. ఇలా ఆలోచించినప్పుడు, ఇంకా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఏర్పడుంది. ఒకరకంగా చెప్పాలంటే నేను ఎల్‌కేజీ విద్యార్థిని అనుకుంటా’’ అంటోంది. ఇంతకీ ఇంత చక్కటి జీవిత సూత్రం చెప్పిన ఈ అల్లరి పిల్ల ఎవరో గుర్తుపట్టారా.
తానింకా ఎల్‌కేజీనే అంటోన్న ఈ తార ఎవరు?
 




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.