పులితో పరాచకాలాడుతోన్న ఈ పిల్ల ఎవరు?
వామ్మో.. పులి!! ఫొటోలో చూస్తేనే మనం ఇలా నోరెళ్లబెట్టకుండా ఉండలేం. అలాంటిది ఈ అందాల చిన్నది చూడండి.. ఏదో పిల్లి పిల్లతో పరాచకాలాడినట్లు పులితో ఆడేసుకుంటోంది. ముఖంలో ముఖం పెట్టి చిరునవ్వులు చిందిస్తోంది. టెడ్డీ బేర్‌ బొమ్మను పట్టుకున్నట్లు గట్టిగా కౌగలించుకోని పడుకుంటోంది. తోక పట్టుకొని లాగుతూ రెచ్చగొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇంత చేస్తున్నా ఆ పులి మాత్రం ఆ అమ్మడును ఏమీ అనట్లేదు. ఒకవేళ అదేమైనా బొమ్మ పులి అయి ఉంటుందిలే అనుకుంటున్నారేమో.. కానే కాదు. అది నిజమైన పులే. అవునా.. మరెందుకు ఆదేం అనట్లేదు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే.. అదొక ఫ్రెండ్లీ టైగర్‌. ఇలాంటి పులులతో మీరు కూడా ఫొటోలు దిగాలంటే.. పట్టయాల్‌లో ఉన్న టైగర్‌ పార్క్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఉండే పులులన్నిటికీ మనుషులతో కలిసి మెలిసి తిరగడం నేర్పిస్తారట. అందుకే అవి ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టవు. తాజాగా ఈ ఇక్కడ కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఆ పార్క్‌ను సందర్శించిందట. ఈ సందర్భంగా వాటితో దిగిన ఫొటోలను తాజాగా ట్విటర్‌ ద్వారా పంచుకుంది. ‘‘ఈ టైగర్‌ పార్క్‌లో పులులన్నీ చాలా క్యూట్‌. ఇవి అల్లరి చేస్తాయి.. సరదాగా ఆడతాయి.. అలాగని వీటికి మత్తు ఇవ్వరు. అందుకే ఎంతో సంతోషంగా తిరుగుతుంటాయి’’ అని దీనికి ఓ క్యాప్షన్‌ జోడించింది. ఇక ఇదంతా సరేకానీ.. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా. అందం.. అభినయం అన్నీ ఉన్నా సరైన హిట్‌ పడకపోవడంతో తెలుగు తెర నుంచి కనుమరుగైపోయింది. రవితేజ వంటి స్టార్‌తో తన తొలి చిత్రాన్ని చేసిన ఈ భామ.. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో తర్వాత అవకాశాలు అందుకోలేక పోయింది. ఇంతకీ ఈ భామ ఎవరో చెప్పుకోండి చూద్దాం.

క్లూ:ఈ భామకు ఎప్పుడూ ‘నేల టికెట్టు’లో కూర్చొని సినిమా చూడటమే ఇష్టమట.
 Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.