దెయ్యంలా మారిన ఈ ఖాన్‌ తనయను గుర్తుపట్టారా?
తెలుగు చిత్రసీమతో పోల్చితే బాలీవుడ్‌లో నట వారసత్వ పోకడలు కాస్త ఎక్కువేనన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడితో పోల్చితే ఉత్తరాదిన నట వారసురాళ్ల సందడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, తార సుతారియా, అనన్య పాండే వంటి వారంతా ఈ కోవకు చెందిన వారే. ఇప్పుడీ జాబితాలో చేరేందుకు ఖాన్‌ల ముద్దుల తనయులు కూడా సిద్ధమైపోతున్నారు. షారుఖ్‌ ఖాన్‌ ముద్దుల కూతురు సుహానా ఖాన్‌ ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటుండగా.. ఆమీర్‌ ఖాన్‌ గారాల పట్టి ఇరా ఖాన్‌ కూడా తెరపై సందడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే వీళ్లిద్దరూ హాట్‌ హాట్‌ ఫొటో షూట్లతో నెట్టింట కుర్రకారుకు మతులు పోగొట్టేస్తున్నారు. వెండితెరపై అడుగుపెట్టక ముందే సోషల్‌వాల్‌పై సొగసుల విందు వడ్డిస్తూ యువతరం మదిపై చెరగని ముద్ర వేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఖాన్‌ల ముద్దుల తనయుల్లో ఒకరు ఇలా పిశాచి అవతారమెత్తి భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘‘దెయ్యం మీ మంచం కింద ఉంటే ఎలా ఉంటుంది? ఇది నేనే మేకప్‌లో’’ అంటూ ఓ ఆసక్తికరమైన వాఖ్యను జత చేశారు. నిజంగా ఈ లుక్‌ చూస్తుంటే పెద్దవాళ్లు సైతం బిత్తరపోయేంత భయానకంగా కనిపించింది సదరు ఖాన్‌ తనయ. ఇంతకీ ఈ భామ ఎవరో మీరు గుర్తుపట్టారా?





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.