ఈ చిన్నారి హీరోను గుర్తుపట్టారా??
పసిపాపలకు పెట్టినట్లు చిట్టి పిలక.. నుదుటిన కాటుక.. మెడలో ఓ పూల దండ.. అమ్మ చేతుల్లో కూర్చోని ముచ్చటగా కెమెరాకు ఫోజిస్తున్న ఈ చిన్నారిని చూస్తుంటే భలే ముద్దొస్తుంది కదా. ఇంతకీ ఎవరీ బుడతడు అని అనుకుంటున్నారా. ఇప్పుడిక్కడ అమ్మ ఒడిలో ఫోజులు కొడుతున్న ఈ చిన్నారి ఇప్పుడు వెండితెరపై ఓ స్టార్‌ హీరో. వైవిధ్యభరిత ప్రేమకథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా దిగ్వి‘జయం’గా సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ యువ హీరో.. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే పెళ్లి చేసుకోని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈరోజు తన తల్లి జన్మదినాన్ని పురస్కరించుకోని చిన్ననాడు ఆమెతో దిగిన ఈ అపురూప చిత్రాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతకీ ఈ యువ హీరో ఎవరో గుర్తుపడితే చెప్పుకోండి చూద్దాం..క్లూ: పవన్‌ కల్యాణ్‌కు తానొక పెద్ద భక్తుడిగా చెప్పుకుంటుంటాడు ఈ యువ హీరో..


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.