విమర్శలే ముద్దంటున్న ఈ ముద్దుగుమ్మ ఎవరు?
పొగడ్త మనిషి ఎదుగుదలకు నిరోధమని తెలిసినా.. ఎక్కువ మంది ఆ పొగడ్తల జడి వానాలోనే తడవాలని ఆశపడుతుంటారు. ఇక చిత్రసీమలోని నటీనటులకు ఇలాంటి పొగడ్తల వానలు తరచూ తగులుతూనే ఉంటాయి. కొందరు వీటిని ఈ చెవిన విని ఆ చెవి నుంచి వదిలేస్తే.. మరికొందరు వాటిలోనే తమ సంతృప్తిని వెతుక్కుంటుంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ అందాల భామకు మాత్రం ఎవరైనా అతిగా పొగుడుతున్నట్లు అనిపిస్తే వెంటనే అర్థమైపోతుందట. ఎందుకంటే.. విమర్శ అయినా, పొగడ్త అయినా నిజాయితీగా ఉండాలని, అలాంటి వాటినే తాను స్వీకరిస్తానని చెబుతోంది. విమర్శ ఆ క్షణాన చేదుగా అనిపించొచ్చు.. కానీ, దాన్ని స్వీకరించకపోతే ఎదగలేరు. కాబట్టే తానెప్పుడూ విమర్శలను స్వీకరించేందుకు సిద్ధంగానే ఉంటానని అంటోంది. ఇంతకీ ఇంత చక్కటి జీవిత సత్యాన్ని బోధించిన ఒకప్పటి బొద్దుగుమ్మ.. నేటి చిక్కిన ఈ చక్కనమ్మ ఎవరో గుర్తుపట్టారా?


క్లూ: ఈ ముద్దుగుమ్మ తన తొలి చిత్రంలో శ్రీ సాయి శిరీష ప్రభావతి అనే పాత్రలో నటించింది. పేరు చాలా పెద్దగా ఉందికదా.. అందుకే ఈ సినిమాలో హీరో ఆమెను ప్రభావతి అని పిలుస్తుంటాడు. వాస్తవానికి ఆ చిత్రంలో ఆమెకు ఆ పేరు నచ్చదు. కానీ, కథానాయకుడు పిలవడం మొదలుపెట్టాకే తనకు ఆ పేరు చక్కగా సెట్‌ అయిందని ఆనంద పడుతుంది. ఇంతకీ చెప్పడం మర్చిపోయాం.. ఈ హీరో పేరు సినిమాలో వెంకటేశ్వర్లు. ఇప్పుడు చెప్పండి ఆ నాయిక ఎవరో.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.