ఈ హీరోలెవరో చెప్పుకోండి చూద్దాం..
ఇక్కడ కనిపిస్తున్నవన్నీ నేడు వెండితెరపై సందడి చేస్తూ.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న తెలుగు కథానాయకుల చిన్ననాటి చిత్రాలు. మరి ఈ హీరోలెవరో గుర్తుపట్టండి చూద్దాం.

1. మెగా వారసత్వంతో వెండితెరపైకి రంగప్రవేశం చేసి తన స్టైలిస్‌ నటనతో, అదరగొట్టే డ్యాన్సులతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. నటనలో ‘దేశముదురు’, అమ్మాయిల గుండెల్లో ‘ఆర్య’. ఎవరో ఈ హీరో..?


2. టాలీవుడ్‌ ‘మన్మధుడు’కు తగ్గ కొడుకుగా అనేక చిత్రాల్లో లవర్‌బాయ్‌గా, మాస్‌ హీరోగా తన ‘జోష్‌’ చూపించాడు. ఇటీవలే తన ప్రేమను పెళ్లి పీటలెక్కించి నిజ జీవితంలోనూ నిజమైన ప్రేమికుడనిపించుకున్నాడు.


3. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత చిత్రరంగంలో అగ్రకథానాయకుడిగా ఎదిగాడు. అతను అవినీతిని సహించని ‘ఠాగూర్‌’, మనసుతో వైద్యం చేసే ‘శంకర్‌దాదా..’, అభిమానుల గుండెల్లో ‘ఖైది’. ఎవరతను?


4. ఆయనొక నట ‘విశ్వరూపం’. విలక్షణ నటనకు చిరునామా. అవినీతిని ఎదిరించడంలో అతనే నిజమైన ‘భారతీయుడు’. తెలుగు, తమిళం అంటూ భాషాభేదాలు లేకుండా హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరు?


5. అతను అమ్మాయిల మనసుదోచే ‘ప్రిన్స్‌’, బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించే ‘బిజినెస్‌ మాన్‌’, తన ‘దూకుడు’కు సాటిపోటీ లేదంటూ టాలీవుడ్‌లో అగ్రహీరోగా దూసుకుపోతున్న యువ కథానాయకుడు?


6. నిజమే అతనికి కొంచెం మెంటల్‌.. కానీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ మగువలంతా అతన్ని అల్లరి పెడుతుంటారు. ఇంతకీ ఎవరీ ‘మన్మధుడు’?7. తన మతిమరుపు ‘అలా మొదలైంది’ అని చెప్పి టాలీవుడ్‌ను నవ్వుల జల్లుల్లో ముంచెత్తాడు. ‘ఎంసీఏ’ చేసిన ఈ పక్కింటి కుర్రాడు విభిన్నమైన కథలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు. మీకు తెలుసా ఎవరో?


8. తన నటనతో ‘బృందావనం’లో కృష్ణుడిలా అభిమానుల మనసులు దోచుకున్నాడు. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. కాకపోతే కొంచెం ‘టెంపర్‌’ ఎక్కువట.


9. ఈ ఫొటోలో ఉన్న ఓ ఇద్దరికి అతను ‘తమ్ముడు’, ఇంకొకరు మిగిలిన ఇద్దరికీ ‘అన్నయ్య’, ఈ చివరన ఉన్న అతను ఓ ‘కౌరవుడు’. అసలెవరు వీళ్లు?


10. ఈ కృష్ణుడు అమ్మాయిలకు మదిలో ‘డార్లింగ్‌’. నటనలో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’. ఆరడుగుల ఎత్తు, ఆకట్టుకునే రూపంతో అలరించే ‘బాహుబలి’. ఎవరీ చిలిపి కృష్ణుడు?


11. వెంకీ చేతిలో గారాలు పోతున్న ఈ కుర్రాడు ఓ ‘లీడర్‌’. కాకపోతే అందరినీ భయపెట్టే ‘భల్లాలుడు’. ఓ ‘అందాల రాక్షసి’కి చిక్కి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఎవరో తెలుసా?


12. సినిమాలే తన ‘గమ్యం’ అన్నాడు. కానీ ఇక్కడ పోటీ ఎక్కువ. అయితేనేం ఏమాత్రం వెనకడుగు వేయక ‘రన్‌ రాజా రన్‌’ అంటూ టాలీవుడ్‌లో పరుగులు తీస్తున్నాడు.


13. చెడ్డవాళ్ల గుండెల్లో అతనో ‘సింగం’. ఎప్పుడు ‘గ్యాంగ్‌’ను వెనకేసుకోని తిరుగుతుంటాడు. ఎవరో గుర్తుపట్టారా?


14. చిరులా కటింగ్‌ ఇస్తున్న ఈ చిరుతడు ఆ ‘కంచె’ నుంచే వచ్చినా తన ప్రతిభతోనే ముందుకెళ్తున్నాడు. తన ‘తొలిప్రేమ’ కథను గెలిపించుకోని అందరినీ ‘ఫిదా’ చేశాడు.


15. కళ్లజోడు, నుదుటున బొట్టు పెట్టుకోని ఎక్కడికో ‘పెళ్లిచూపులు’ చూసేందుకు వెళ్తున్నట్లున్నాడీ కుర్రాడు. గుర్తుపట్టారా ఎవరో?


16. చేతిలో కర్ర, తలకు తలపాగ చుట్టుకోని ఎంత ముద్దుగా ఉన్నాడో కదా ఈ కుర్రాడు. కానీ అతను అల్లరిలో ‘కందిరీగ’. పోట్లాటకు ముందుండే ‘ఒంగోలు గిత్త’.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.