కామెడీ ట్రాకులు గుర్తు చేస్తున్నా సినిమా పేరేంటో....?
సినిమా అంటేనే వినోదం.‌ హాయిగా నవ్వు‌కో‌వ‌డా‌నికి కాసిన్ని నవ్వులు లేక‌పోతే ఏదో వెలితి.‌ ‌‘ఈ సిని‌మాలో అన్నీ బాగు‌న్నాయ్‌.‌.‌.‌ బ్రహ్మా‌నందం ఉంటే ఇంకా బాగుం‌డేది’‌ అంటూ హాస్య ‌న‌టుల్ని మళ్లీ మళ్లీ తల‌చు‌కుం‌టూనే ఉంటాం.‌ అందుకే కొన్ని కామెడీ ట్రాకుల్ని కథలో జోడి‌స్తుం‌టారు దర్శ‌కులు.‌ ఆ ట్రాక్‌ హిట్ట‌యితే.‌.‌.‌ సినిమా ఆడే‌సిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.‌ ఇక్కడ మీకు కొన్ని కామెడీ ట్రాకులు గుర్తు చేస్తున్నాం.‌ ఆ సన్ని‌వేశం ఆధా‌రంగా సినిమా పేరేంటో టక్కున చెప్పే‌యండి.‌

* బ్రహ్మా‌నందం ఓ దొంగ.‌ ఒక్క మాట కూడా మాట్లా‌డడు.‌ అమా‌య‌కంగా కని‌పి‌స్తూనే ఇల్లంతా గుల్ల చేస్తుం‌టాడు.‌ ఎస్వీ కృష్ణా‌రెడ్డి దర్శ‌కత్వం వహిం‌చిన ఈ సినిమా పేరేంటి?

* సునీల్‌ పెట్రోల్‌ బంకు ఓనరు.‌ ఏ విష‌యా‌నికి కోపం వస్తుందో, ఎప్పుడు ఎలా స్పంది‌స్తాడో ఎవ్వరూ చెప్ప‌లేరు.‌ ఈ మేన‌రి‌జం‌తోనే బోల్డంత నవ్విం‌చే‌సిన నాగా‌ర్జున సినిమా ఏది?

* అలీ తెలి‌వైన దొంగ.‌ ప్రతీ‌సారీ పోలీస్‌ ఆఫీ‌సర్‌ అయిన జీవాని బురిడీ కొట్టించి.‌.‌ వాహ‌నాల్ని ఓ చోటి నుంచి మరో చోటికి తీసు‌కె‌ళ్లి‌పో‌తుం‌టాడు.‌ పూరి జగ‌న్నాథ్‌ దర్శ‌క‌త్వంలో రూపొం‌దిన ఈ సిని‌మా‌లోని కామెడీ ట్రాక్‌ ప్రేక్ష‌కుల్ని భలేగా నవ్విం‌చింది.‌

* వేణు‌మా‌ధవ్‌ ఒట్టి అబ‌ద్ధాల కోరు.‌ తన మాట‌లతో ఎలాం‌టి‌వా‌ళ్ల‌నైనా బురిడీ కొట్టి‌స్తాడు.‌ ఓసారి నర్సింగ్‌ యాదవ్‌ కని‌పిస్తే ‌‘నాకు క్యాన్సర్‌ ఉందన్నా’‌ అంటూ ఏవేవో కథలు చెప్పి డబ్బులు బాగా గుంజే‌స్తాడు.‌ వెంక‌టేష్‌ కథా‌నా‌య‌కు‌డిగా నటిం‌చిన సినిమా ఇది.‌ పేరేంటో తెలుసా?


* సప్త‌గిరి కాఫీలూ, టీలూ అమ్ము‌కుం‌టుం‌టాడు.‌ నాట‌కా‌లంటే పిచ్చి.‌ అలాంటి సప్త‌గి‌రితో లాయర్‌ వేషం వేయి‌స్తాడు నాగ‌చై‌తన్య.‌ కోర్టులో సప్త‌గిరి చేసే విన్యా‌సా‌లకు కడు‌పుబ్బా నవ్వు‌కోవా‌ల్సిందే.‌ ఈ ట్రాక్‌ ఏ సిని‌మా‌లో‌నిదో తెలుసా?Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.